HIT 3 Teaser : ఇకపై ఒరిజినల్ చూపిస్తా - నాని

HIT 3 Teaser :  ఇకపై ఒరిజినల్ చూపిస్తా - నాని
X

నేచురల్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో ఉన్న నాని సడెన్ గా మాస్ మూవీస్ తో మెప్పిస్తున్నాడు. కొన్నాళ్లుగా మాస్ హీరోగా మారేందుకే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కథలే సెలెక్ట్ చేసుకుంటున్నాడు.ఆ లిస్ట్ లోనే ఇప్పుడు 'హిట్ 3'అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ 'కేస్' వేరే. తన వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ లో రూపొందించిన హిట్ 1, హిట్ 2 చిత్రాల ఫ్రాంచైజీలో థర్డ్ కేస్ లో తను నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ నటించారు. ఆ రెండూ హిట్టయ్యాయి. ఇప్పుడు థర్డ్ మూవీతో తను వస్తున్నాడు.

డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్రాంఛైజీలో ఇవాళ నాని బర్త్ డే సందర్భంగా థర్డ్ కేస్ టీజర్ విడుదల చేశారు. మొదట్నుంచీ ఈ మూవీని వీక్ మైండ్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఆ రేంజ్ లో వయొలెన్స్ ఉంటుందంటున్నారు. నాని అర్జున్ సర్కార్ అనే వయొలెంట్ కాప్ గా నటిస్తున్నాడు.

ఇక టీజర్ హిట్ మూవీ ఫ్రాంఛైజీ టెంప్లేట్ లోనే ఉంది. వరుస మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ కేస్ ను అర్జున్ సర్కార్ కు అప్పగించడం. ఆ క్రమంలో అతని లాఠీకి దొరికే వారి పరిస్థితి ఏంటా అని ఆఫీసర్ చెప్పడం.. ఆపై అర్జున్ ఎంట్రీ.. చాలా అగ్రెసివ్ గా కనిపించే పోలీస్ గా నాని నటన ఈ సారి కూడా ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో కొన్ని అడల్ట్ డైలాగ్స్, మోస్ట్ వయొలెంట్ సీన్ ఉన్నాయి. ఇలాంటివి నాని ఇంతకు ముందు చేయలేదు. అందుకే అతనికి కొత్తగా, ఫ్యాన్స్ కు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మొత్తంగా టీజర్ తోనే ఓ రగ్ డ్, వయొలెంట్ మూవీకి ప్రిపేర్ అయిపోండి అని చెప్పినట్టుగా ఉంది. టీజర్ లో ఓ చోట జనం అలాగే అనుకుంటున్నారు కానీ ఇకపై ఒరిజినల్ చూపిస్తా అనే డైలాగ్ ఉంది. దీన్ని బట్టి అతను తనలోని మాస్ యాంగిల్ ను చూపించేందుకే ప్రిపేర్ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు.

ఇక నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నాని బర్త్ డే టీజర్ కాబట్టి హీరోయిన్ కు సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా లేదు ఇందులో. మొత్తంగా హిట్ 3 ఈ కేస్ ఇంకా వయొలెంట్ గా ఉంటుందని మాత్రం అర్థం అయింది.

Tags

Next Story