HIT 3 Trailer : హిట్ 3 ట్రైలర్.. జనాలతో అర్జున్ మృగాలతో సర్కార్

నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా హిట్ 3. హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో వస్తోన్న థర్డ్ మూవీ ఇది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. నాని ముందు నుంచీ చెబుతున్నట్టుగానే విపరీతమైన హింస కనిపిస్తోంది. హిట్ అంటే ఇంగ్లీష్ లో చూస్తే ‘హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్’ అని అర్థం. పోలీస్ లకూ సాధ్యం కాని కేస్ లను వీళ్లు ఛేదిస్తుంటారు. డిపార్ట్ మెంట్ లోనే ఉంటారు. కానీ వీరిది ప్రత్యేక విభాగం. ఆ విభాగంలో పనిచేసే అర్జున్ సర్కార్ వద్దకు 9 నెలల పాప కిడ్నాప్ కేస్ వస్తుంది. ఆ పాపు కిడ్నాప్ చేసిన వాడిని వెదుకుతూ అతను దేశమంతా తిరుగుతాడు. చివరికి పట్టుకుంటాడు అనేది తెలిసినా.. ఈ మూవీలో ఉండే ప్రత్యేకత ప్రకారం అదో సస్పెన్స్ డ్రామా. ఆద్యంతం ఉత్కంఠ కలిగించడం.. విలన్ చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడం.. అసలు అతనెవరో చివరి వరకూ తెలియకపోవడం.. ఇందులోనూ అదే ఫార్మాట్ కనిపిస్తోంది. కాకపోతే వయొలెన్స్ ఓ రేంజ్ లో ఉంది.
నాని లాంటి హీరో నుంచి ఇంత వయొలెన్స్ అంటే ఆడియన్స్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు.. సర్వైవ్ అవుతాడా అనే డౌట్స్ కూడా రాకుండా.. ఒకవేళ వచ్చినా.. ట్రైలర్ లోనే ఓ డైలాగ్ పెట్టాడు.. ‘అతనితో తలపడిన ఓ అమ్మాయి.. ‘నువ్విక్కడ సర్వైవ్ కాలేవు’ అంటుంది. దానికి అతను.. ‘నా కెరీర్ ప్రారంభం నుంచి వింటున్నానీ మాట’ అంటాడు. సో.. ఇక డౌట్స్ అక్కర్లేదు అని చెప్పకనే చెప్పాడు. అలాగే టీజర్ లోనేమో.. తను సాఫ్ట్ కాదు.. ఇన్నాళ్లూ అలా అనుకునే జనం మోసపోయారు అనే డైలాగ్ పెట్టాడు. అంటే తనలో ఇకపై మాస్ హీరోను మాత్రమే చూస్తారని చెప్పాడు.
ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. నాని కొత్త ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ కాబోతోంది అనిపించేలా ఉంది. శ్రీనిధిశెట్టితో ఓ డైలాగ్ పెట్టారు.. నిన్ను అర్జున్ అని పిలవాలా.. సర్కార్ అని పిలవాలా అంటుంది తను.. దానికి అతను ‘జనాల మధ్యలో ఉంటే అర్జున్.. మృగాల మధ్యలో ఉంటే సర్కార్’ అని పిలవాలని చెబుతాడు. దీన్ని బట్టి అతను మృగాలను ఎంత బలంగా వేటాడతాడో అర్థం చేసుకోవచ్చు.
విలన్ ఎవరనేది సినిమా చివర్లోనే తెలుస్తుంది కాబట్టి.. ఈ ట్రైలర్ లో అతనెవరు అనేది చూపించలేదు. కాకపోతే పాప మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇచ్చిన లేడీ పాత్ర కీలకంగా కనిపిస్తోంది. మొత్తంగా నాని పీకలు కోస్తూ ఒళ్లంతా రక్తంతో కనిపిస్తుంటే.. కాస్త గగుర్పాటుగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com