Today Movies Review : ఏది హిట్టు.. ఏది ఫట్టు
పంద్రాగస్టుకు కానుకగా రామ్ డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగాలన్ సినిమాలు రిలీజయ్యాయి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
నిజాయితీ గల ఐటీ ఆఫీసర్ వ్యవస్థను ఎదుర్కొని ఏం చేయగలడనేది మిస్టర్ బచ్చన్ స్టోరీ. రవితేజ ఎనర్జీ, హీరోయిన్ గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫస్టాఫ్ హుషారుగా సాగుతుంది. మ్యూజిక్, సత్య కామెడీ, హీరో సిద్ధూ కనిపించే సీన్లు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ హరీశ్ శంకర్ డీలాపడ్డారు. సాగదీత, ఊహించే సీన్లు, ట్విస్టులు లేకపోవడం, పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇబ్బంది పెడతాయి.
తన తల్లిని చంపిన మాఫియా డాన్ సంజయ్‌దత్ పై హీరో రామ్ ఎలా పగ తీర్చుకున్నాడనేదే డబుల్ ఇస్మార్ట్ కథ. తొలి భాగం మాదిరిగానే ఇందులోనూ మెమొరీ చిప్ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ పూరీ కొనసాగించారు. రామ్ యాక్షన్, సంజయ్ విలనిజం, క్లైమాక్స్ సినిమాకు ప్లస్. హీరోయిన్ కావ్యా థాపర్‌కు ప్రాధాన్యతలేదు. రొటీన్ కథ, పేలవమైన కామెడీ, ముందే ఊహించగలిగే సీన్లు సినిమాకు మైనస్. పూరీ టేకింగ్ స్టైల్ మిస్సయ్యింది.
ఇక పా రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్ మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. చియాన్ యాక్టింగ్, మేకప్, గ్రాండ్ విజువల్స్, బీజీఎం అదిరిపోయాయని ప్రేక్షకులు పోస్టులు చేస్తున్నారు. మధ్యలో కొంచెం స్లోగా అనిపించినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు. డైరెక్టర్, హీరోకు కమ్ బ్యాక్ లాంటి చిత్రమని చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com