HIT3 OTT Release : ఓటిటిలోకి హిట్ 3.. ఎప్పుడంటే..

HIT3 OTT Release :  ఓటిటిలోకి హిట్ 3.. ఎప్పుడంటే..
X

నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ హిట్ 3. మే 1న విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇది. హిట్ మూవీ ఫ్రాంఛైజీలో వచ్చిన ఈ థర్డ్ కేస్ లో అంతులేని హింస ఉన్నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నానిలాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న స్టార్ వయొలెన్స్ తో రక్తపాతం సృష్టించి.. థియేటర్స్ ను బ్లడ్ షెడ్ చేసినా అంగీకరించారు. సెకండ్ హాఫ్ పై కొన్ని కంప్లైంట్స్ ఉన్నా.. సినిమా హిట్ అయిపోయింది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బలమైన విలన్ లేకపోయినా.. కేవలం నాని ఒన్ మేన్ షోగా అదరగొట్టింది హిట్ 3. నాని సొంత బ్యానర్ లోనే రూపొందిన ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

జూన్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోందీ చిత్రం. ఓ రకంగా హిట్ మూవీని ఇంత త్వరగా ఓటిటికి తీసుకువస్తుండటం కాస్త ఆశ్చర్యమే అయినా.. ఈ మూవీ ఓటిటి రైట్స్ కూడా భారీగానే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ ఆరు వారాల స్కీమ్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ భాషల్లోనూ అదే రోజు నుంచి అందుబాటులోకి రాబోతోందీ మూవీ. మరి ఈ రక్తపాతానికి ఓటిటి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story