Nani HIT3 : నాని హిట్ 3కి మల్టీప్లెక్స్ షాక్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ వయొలెంట్ గా మారిపోయాడు. హిట్ 3 మూవీతో ఏ సర్టిఫికెట్ తో వస్తున్నాడు. ఈ సారి ఇంతకు ముందెప్పుడూ చూడనంత రక్తపాతం తన సినిమాలో కనిపించబోతోందని తనే చెబుతూ వస్తున్నాడు. హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో వస్తోన్న ఈ థర్డ్ కేస్ మే 1న విడుదల కాబోతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ చూస్తే నాని చెప్పింది నిజమే అనిపించేలా ఉంది.
కొన్నాళ్లుగా ప్యాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు నాని. దసరా నుంచి ఆ మార్కెట్ పై మరింతగా ఫోకస్ చేస్తున్నాడు. అలా హిట్ 3ని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయబోతున్నాడు. అయితే హిందీలో నానికి మల్టీప్లెక్స్ లు షాక్ ఇవ్వబోతున్నాయి అనే న్యూస్ వినిపిస్తోంది. మల్టీప్లెక్స్ లేవీ హిట్ 3ని ప్రదర్శించడానికి సిద్ధంగా లేవు అంటున్నారు. ఈ కారణంగా హిందీలో హిట్ 3ని కేవలం సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. మరి రిలీజ్ కు ఇంకాస్త టైమ్ ఉంది కాబట్టి.. ఈ లోగా ఈ ఇష్యూను పరిష్కరించకుంటారేమో కానీ.. ప్రస్తుతానికైతే హిట్ 3 హిందీ వెర్షన్ మల్టీప్లెక్స్ ల్లో లేదు అని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com