James Bond : జేమ్స్ బాండ్ కావలెను..

జేమ్స్ బాండ్ 007 .. ప్రపంచంలో బెస్ట్ స్పై హీరోగా తిరుగులేని క్రేజ్ ఉన్న పాత్ర. 1953లో కేసినో రాయల్ తో క్రియేట్ చేసిన ఈ పాత్ర ఆ తర్వాత 1962లో వచ్చిన డాక్టర్ నో నుంచి 2023లో చివరగా వచ్చిన నో టైమ్ టు డై వరకూ వాల్డ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసినవే. అయితే కొన్నేళ్లుగా బాండ్ ప్రాభవం తగ్గింది అనే చెప్పాలి. అందుకు కారణం అనేకమంది సూపర్ హీరోస్ రావడం.. ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న సూపర్ హీరోస్ బాండ్ ను మించిన వినోదం అందిస్తుండటమే అనేది విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు జేమ్స్ బాండ్ మూవీ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో లేరు అనేది వాస్తవం. లేదంటే జేమ్స్ బాండ్ మూవీకి హీరో దొరకకుండా ఉంటాడా.
ఈ పాత్రలో ఎక్కువ సార్లు బాండ్ పాత్రలో నటించింది రోజర్ మూర్. ఈయన ఏడు సినిమాల్లో బాండ్ గా అదరగొట్టాడు. ఆ తర్వాత ఫస్ట్ జేమ్స్ బాండ్ అయిన సీన్ కానరీ ఆరు సినిమాల్లో నటించాడు. తిమోతీ డాల్టన్ రెండు సినిమాలు.. పియర్స్ బ్రాస్నన్ నాలుగు సినిమాలు చేస్తే ప్రస్తుతం చివరి మూవీ వరకూ చేసిన డేనియల్ క్రెయిగ్ ఐదు సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ 26 బాండ్ మూవీస్ వచ్చాయి. మరో సినిమా కోసం నిర్మాణ సంస్థ వేచి చూస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా డేనియల్ క్రెయిగ్ నే తీసుకున్నారు. కానీ ఎందుకో అతను తప్పుకున్నాడు. నిజానికి డేనియల్ రెండు సినిమాల తర్వాతే నో చెప్పాడు. బట్ తర్వాత మూడు సినిమాలకూ ఒప్పించారు. ఇకపై చేయను అని చెప్పడంతో కొత్త బాండ్ కోసం వెదుకుతున్నారు. ఈ పాత్రకు సంబంధించి హీరో కు కొన్ని ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి. వాటిలో పిల్లి కళ్లు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. అలాంటి నటులు చాలామందే ఉన్నా.. ఎందుకో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఒకప్పుడు ఐకనిక్ స్పై గా అద్భుతంగా ఎంటర్టైన్ చేసిన జేమ్స్ బాండ్ పాత్ర దీనంగా మారిపోయిందనే చెప్పాలి.
ఆ మధ్య టారన్ ఎగర్టన్ అనే నటుడిని తీసుకోవాలనుకున్నారు. మొదట అతను సుముఖంగానే కనిపించినా.. తర్వాత తాను ఆ పాత్రకు సరిపోనని.. తను మంచి ఛాయిస్ కాదు అని చెప్పి తప్పుకున్నాడు. సో.. ఈ వేట ఇలా కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com