RRR : దుబాయ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ స్టార్ హీరో

RRR : బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ 'రౌద్రం..రణం..రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్).. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, రాజీవ్ కనకాల, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించగా కీరవాణి సంగీతం అందించారు.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని మార్చి 25, 2022న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. అయితే మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.. అంతేకాకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలని రాజమౌళి భావిస్తున్నారట. దీనిపైన ఆయనతో చర్చలు కూడా చేస్తున్నారని సమాచారం.
ఇండియన్ మూవీస్‌కి హాలీవుడ్ హీరోలు చీఫ్ గెస్ట్‌గా రావడం అనేది కొత్తేమి కాదు.. శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన ఐ సినిమా ఆడియో లాంచ్‌కి ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. 2008లో దశావతారం ఆడియో లాంచ్‌కు జాకీచాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇప్పుడు RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మిషన్ ఇంపాజిబుల్ హీరో టామ్ క్రూజ్ రానున్నాడని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. కాగా దుబాయ్‌లో కనీవినీ ఎరుగని రేంజ్‌లో మార్చి 15న ఈ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com