Yuva Rajkumar : పునీత్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..!

Yuva Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకు యువ రాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. రాజ్‌కుమార్ మూడోతరం నటుడిని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో కనిపించిన యువ రాజ్‌కుమార్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాడు. 'రాజకుమార', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంతోశ్ ఆనంద్‌ద్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ.
— Hombale Films (@hombalefilms) April 27, 2022
ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ
The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com