Peddi Movie : హాట్ టాపిక్ గా పెద్ది హాస్పిటల్ సీక్వెన్స్

Peddi Movie :  హాట్ టాపిక్ గా పెద్ది హాస్పిటల్ సీక్వెన్స్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు టీజర్ రాలేదు. ట్రైలర్ రాలేదు. అయినా ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. కాకపోతే వచ్చిన రెండు గ్లింప్స్, రెండు పాటలు ఈ అంచనాలన్నిటికీ కారణం అంటే అతిశయోక్తి లేదు. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అని గ్లింప్స్ తోనే అర్థం అవుతుంది. అయితే ఈ మూవీ అలా ఉండబోతోంది.. ఇలా ఉండబోతోంది అంటూ రోజుకో వార్త మాత్రం హల్చల్ చేస్తూనే ఉంది. అయితే ఇవన్నీ గాసిప్స్ మాత్రం కాదు అనేది తెలుస్తోంది. తాజాగా అలాంటి వార్తే ఒకటి వినిపిస్తోంది.

పెద్ది సినిమాలో ఓ ఇంటెన్సిటీ హాస్పిటల్ సీక్వెన్స్ ఉండబోతోందట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవబోతోందంటున్నారు. అలాగే ఈ సీక్వెన్స్ లో రామ్ చరణ్ నట విశ్వరూపం ఉండబోతోందంటున్నారు. మామూలుగా ఇలాంటి సీక్వెన్స్ లు చాలా సినిమాల్లో ఉంటాయి. బట్ పెద్దిలో మాత్రం ఆ అన్నిటికీ మించి ఉంటుందని టాక్. దీనికోసం రామ్ చరణ్ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడట. అలాగే బుచ్చిబాబు కంటే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సీక్వెన్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నాడంటున్నారు. లైటింగ్ పరంగా కూడా ఈ సీక్వెన్స్ హైలెట్ అవుతుందని అంటున్నారు. సో.. మొత్తంగా ఈ మూవీ గురించి రకరకాల వార్తలు మాత్రం తెగ ఊరిస్తున్నాయి. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్సెస్ లో కూడా పెద్దిపై మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందనేది చూసేవారి అంచనాలను మించి ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది.

Tags

Next Story