Adivi Sesh : అడివి శేష్ తో హాట్ హీరోయిన్

వరుసగా మూవీస్ చేస్తూ సడెన్ గా గ్యాప్ తీసుకున్నాడు అడివి శేష్. 2024లో అతన్నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మేజర్ తర్వాత ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా డెకాయిట్ అనౌన్స్ అయింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా మొదట స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాలతో ఆ మూవీ బాగా లేట్ అయింది. దీంతో శ్రుతి హాసన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ కారణంగా 2024లో రావాల్సిన డెకాయిట్ 2025కి షిఫ్ట్ అయింది. ఈ మూవీలో శేష్ సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు చాలాకాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న గూఢచారి 2 ను కూడా స్టార్ట్ చేశాడు శేష్.
తాజగా ఈ మూవీలో హాట్ బ్యూటీ వామికా గబ్బి ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోందంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అంతే కాదు.. చాలామందికి డ్రీమ్ రోల్ అయిన ఏజెంట్ 116 అనే ట్యాగ్ ను కూడా ఈ బ్యూటీకే ఇచ్చాడు. వామికా ఈ మధ్య కాలంలో తన హాట్ గెశ్చర్స్ తో నిత్యం వార్తల్లో ఉంటోంది. ఆ మధ్య ఖూఫీయా అనే మూవీలో చేసిన రోల్ కు సోషల్ మీడియా హీటెక్కిపోయింది. తాజాగా బేబీ జాన్ లో చేసిన పాత్ర కంటే ప్రమోషన్స్ లో తను పంచిన వినోదమే ఎక్కువ హైలెట్ అయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న ఈ బ్యూటీ 2015లోనే తెలుగులో భలే మంచి రోజు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విజయం సాధించినా మళ్లీ ఆఫర్స్ రాలేదు. ఇన్నాళ్లకు సరైన ఛాన్స్ పడింది. గూఢచారిణిగా నటించబోతోంది. మరి ఈ మూవీతో అమ్మడు తెలుగులో మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com