Bigg Boss 5 Telugu: హౌస్‌మేట్స్‌ను రెచ్చగొట్టిన నటరాజ్ మాస్టర్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లో నాలుగో వారం వచ్చేసరికి ప్రతీ ఒక్కరు తమ సహనాన్ని కోల్పోతున్నారు. ఒక్కొక్కరి అసలు రంగులు మెల్లగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్న పద్ధతి చూస్తుంటే ఒకరిపై ఒకరు ఎంత ద్వేషం పెంచుకున్నారో అర్థమైపోతుంది. అందుకే ఈసారి ఏకంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు.
ముఖ్యంగా ఈసారి నామినేషన్స్‌లో అందరూ విచక్షణ లేకుండా ప్రవర్తించినట్లు అనిపించింది. లోబో తాను లో క్లాస్ నుండి వచ్చానని చెప్తూ ప్రేక్షకుల సింపతీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. అదే విషయాన్ని షన్నూ పాయింటవుట్ చేయగా తనపై కోప్పడ్డాడు లోబో. అంతే కాక ప్రియా తన ప్రేమకథను హేళన చేసిందంటూ తనపైన గట్టిగట్టిగా అరుస్తూ తన కూల్ యాటిట్యూడ్‌ను కొల్పోయాడు. ఇక ఇప్పటివరకు కూల్‌గా గేమ్ ఆడుతూ అవసరం ఉన్న చోట మాట్లాడుతూ లేని చోట సైలెంట్‌గా ఉన్న నటరాజ్ మాస్టర్ కూడా తన పంతాను మార్చేసాడు.
విశ్వ, మానస్‌లపై అనవసరంగా అరుస్తూ వారితో గొడవపడ్డాడు. ముఖ్యంగా విశ్వతో మాస్టర్‌కు జరిగిన గొడవ కాసేపు హౌస్ వాతావరణాన్నే మార్చేసింది. ఇలా గొడవలతో, వాగ్వాదాలతో ఈవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీలు డేంజర్ జోన్‌లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com