Upendra : ఆంధ్రాకింగ్ గా కన్నడ హీరోనా..?

రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న మూవీ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేష్, మురళీశర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ టైటిల్ గ్లింప్స్ చూస్తే సగం టైటిల్ రోల్ లో రామ్ కనిపిస్తున్నా.. మొదటి సగం మాత్రం ఉపేంద్ర చేస్తున్నాడు అని అర్థం అవుతోంది. గతంలో ఉపేంద్ర తెలుగులో కీలక పాత్రలు చేసి ఉన్నాడు. అవి హిట్ అయ్యాయి. అయితే ఈ సారి మాత్రం ఆంధ్రాకింగ్ అనే పాత్ర. ఇందులో ఉపేంద్ర సినిమా హీరో పాత్ర చేస్తున్నాడు. అతనికి ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉంటుంది. అతని అభిమానిగా రామ్ పోతినేని కనిపించబోతున్నాడు. అందుకే ఆంధ్రాకింగ్ పాత్రలో ఓ కన్నడ హీరోను ఎలా తీసుకుంటారు అనే ప్రశ్నలు వేస్తున్నారు కొందరు. అవుతున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి టైటిల్ కన్నడ కింగ్ అని పెట్టి ఓ తెలుగు హీరోను తీసుకుంటే అక్కడి వారు భగ్గుమంటారు. వారికి అంత భాషాభిమానం. తమిళ్ వాళ్లైనా అదే చేస్తారు. బట్ తెలుగు వారికి ఆ కోపం రావడం లేదు. రాదు కూడా. అయితే అందుకు ఓ కారణం ఉంది. మనవాళ్లు సినిమాల విషయంలో కాస్త మెచ్యూర్డ్ గానే ఉంటారు. అదే ఉపేంద్ర పై నెగెటివ్ కామెంట్స్ రాకపోవడానికి కారణం.
నిజానికి ఈ పాత్రలో ఎవరైనా తెలుగు హీరోను తీసుకోవాలనుకుంటే ఎవరు ఒప్పుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఎవరైనా స్టార్ ఒప్పుకున్నా.. మరో హీరో అభిమానులతో పంచాయితీ తప్పదు. అతనో హీరో.. అతను ఆంధ్రా కింగా అంటూ ఇంకొందరు మొదలుపెడతారు. పైగా ఆ టైటిల్ కు తగ్గట్టుగా మన దగ్గర ఒక్క హీరో లేరు. ఎందుకంటే అందరూ ఆంధ్రా కింగ్ లే. సో.. సమస్య అవుతుంది. అందుకే వీళ్లు కాస్త తెలివిగా ఆలోచించారు అనుకోవచ్చు. ఉపేంద్రను తీసుకువచ్చారు. పైగా ఉపేంద్రకు యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉంటుంది. అతన్ని తెలుగువాళ్లు కూడా బాగా ఓన్ చేసుకుంటారు. ఇక్కడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీనికి తోడు ఇన్ డైరెక్ట్ గా కన్నడ మార్కెట్ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.
సో.. ఆంధ్రాకింగ్ అనే టైటిల్ లో ఉపేంద్ర ఉండటమే ఓ రకంగా కరెక్ట్. తెలుగువాళ్లైతే మొదటికే ఇబ్బంది అవుతుంది. అంచేత ఈ మూవీ మేకర్స్ ది సరైన నిర్ణయమే అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com