Naveen Polishetty : నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ ఎలా జరిగింది..?

ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టికి ( Naveen Polishetty ) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తన చేతికి చాలా చోట్ల ప్రాక్చర్స్ అయ్యాయట. అలాగే కాలికి కూడా. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే తను కొన్నాళ్లుగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో కనిపించడం లేదు. దీంతో రకరకాల వార్తలు వస్తున్నాయట. అందుకే తనే స్వయంగా ఇది చెబుతున్నా అంటూనే.. తను చెబితే తప్ప తన గురించి ఇంకెవరూ చెప్పినా నమ్మొద్దంటున్నాడు.
ఈ ప్రమాదం కారణంగానే మీ అందరికీ దూరంగ ఉంటున్నాను. నా క్రియేటివ్ వర్క్ ఆగిపోయినందుకు చాలా బాధగా ఉందంటూనే.. ఈ గాయాలు కూడా చాలా బాధిస్తున్నాయంటున్నాడు. ఇక రికవరీ కూడా చాలా స్లోగా జరుగుతోందట. అంటే ప్రమాద తీవ్రత పెద్దగానే ఉందనుకోవాలి. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నాను అంటూ.. త్వరలోనే మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తానని, అందుకోసం మీ అందరి ప్రేమ, ప్రేయర్స్ కావాలంటూ ఈ పోస్ట్ లో తెలిపాడు నవీన్ పోలిశెట్టి.
అయితే తనకు ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ స్థాయిలో ప్రాక్చర్స్ అయ్యాయంటే ఖచ్చితంగా పెద్ద యాక్సిడెంటే అయ్యిందనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద గాయాలున్నాయని, రికవరీ చాలా స్లోగా ఉందని తనే చెబుతున్నాడు కాబట్టి. ఏదేమైనా నవీన్ త్వరగా కోలుకుని తనదైన ఎనర్జీతో మళ్లీ మనల్ని అలరించాలని కోరుకుందాం.
విశేషం ఏంటంటే.. అతను అనుష్క శెట్టితో కలిసి నటించిన ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలశెట్టి’ సినిమా ఫిల్మ్ ఫేర్ - 2024 లో మూడు నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీస్ లో ఈ మూవీ ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com