Balakrishna : బాలయ్య కొత్త లుక్.. ఎవరి కోసం

Balakrishna :  బాలయ్య కొత్త లుక్.. ఎవరి కోసం
X

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా అఖండ 2 తాండవం. అఖండకు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ త్వరలోనే చిత్రీకరణకు వెళ్లబోతోంది. బాలయ్య కొత్త సినిమాలకు సంబంధించి ఓ బెస్ట్ సెంటిమెంట్ ఉంది. ఆయనకు గెటప్ సెట్ అయితే సినిమా హిట్ అయినట్టే అని. గత కొన్నాళ్లుగా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య. దాన్ని కంటిన్యూ చేయడం కోసం లేటెస్ట్ గా ఓ కొత్త లుక్ ను వదిలారు. అయితే ఇది బోయపాటి సినిమా కోసమేనా లేక ఇంకేదైనా కొత్త సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.

కానీ చూస్తోంటే వీర సింహారెడ్డి లుక్ తో కనిపిస్తోంది. నల్ల చొక్కా, యాష్ కలర్ లుంగీతో తొడకొట్టి ఏదో డైలాగ్ చెబుతున్నట్టుగా ఉందీ లుక్. అయితే ఇది ఏ సినిమా లుక్ అనే క్లారిటీ కంటే ముందు.. అసలు ఈ లుక్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరి ఎలా ఉంది అనేది ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపిస్తే.. అది ఏ సినిమా కోసం ప్రయత్నిస్తోన్న లుక్ అనేదాన్ని ఆ సినిమా మేకర్స్ ఓ నిర్ణయం తీసుకుంటారట. అదీ మేటర్.

Tags

Next Story