Karthi : సత్యం సుందరం ట్రైలర్.. ఫన్ విత్ ఎమోషన్

Karthi :   సత్యం సుందరం ట్రైలర్.. ఫన్ విత్ ఎమోషన్
X

రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ అంటే తమిళ్ వాళ్లు చాలా సహజంగా కనిపిస్తారు. వాళ్ల నేటివ్ కు తగ్గ ఎమోషన్స్ ను అద్భుతంగా పండిస్తారు. ఆర్టిస్టులు సైతం బాగా ఇన్వాల్వ్ అవుతారు. అందుకు మరో ఎగ్జాంపుల్ ఈ మూవీ అనేలా కనిపిస్తోంది సత్యం సుందరం ట్రైలర్. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ నెల 28న విడుదలవుతోంది. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అరవింద్ స్వామికీ అభిమానులున్నారు. కానీ ఈ మూవీ వస్తోన్న టైమ్ ఇక్కడ సరిగా లేదు. లేదంటే ఓ మంచి కంటెంట్ తో కనిపిస్తోన్న సత్యం సుందరం పెద్ద విజయం సాధించే సత్తా ఉన్న మూవీలా కనిపిస్తోంది.

సత్యం సుందరం మూవీ ట్రైలర్ చూస్తే.. తన బావమరిది కార్తీ ఉండే ఊరికి వెళ్లడానికి ఇబ్బంది పడే అరవింద్ స్వామి.. ఓ రోజు ఆ ఊరెళతాడు. బావంటే చాలా ఇష్టం ఉన్న కార్తీ అతన్ని చాలా గొప్పగా చూసుకుంటాడు. తన బావ గురించి ఊరంతా గొప్పలు చెప్పుకుంటాడు. అతనికి ఇష్టమైన వన్నీ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని ఫన్నీగా చూపించారు ట్రైలర్ లో. అయితే అరవింద్ స్వామికి ఆ ఊరితో ఉన్న ఎమోషనల్ బాండ్ ఏంటనేది మాత్రం కనిపించలేదు. బట్ చివర్లో ఓ బిట్ సాంగ్ తో ఇందులో కేవలం మంచి వినోదమే కాదు.. హృదయాల్ని మెలిపెట్టే ఎమోషన్ కూడా ఉందన్న విషయం అర్థం అవుతుంది.

అలాగే చివర్లో ఎద్దును వదిలే సీన్ ఉంది. దీన్ని బట్టి ఇందులో తమళనాడు సంప్రదాయ జల్లికట్టు నేపథ్యం కూడా ఉందనిపిస్తోంది. బట్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, ట్రైలర్ లో ఉన్న దానికి మించి ఇంకేదో బలమైన కంటెంట్ అయితే ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. అది కనెక్ట్ అయితే ఖచ్చితంగా కమర్షియల గా బ్లాక్ బస్టర్ అవుతుంది.

తమిళ్ లవ్ స్టోరీ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తీ, అరవింద్ స్వామితో పాటు రాజ్ కిరణ్, శ్రీ దివ్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గోవింద్ వసంత్ సంగీతం చేశాడు. మరి ఈ సత్యం సుందరం తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

Tags

Next Story