Sonusood : సోనూసూద్ ఫతే టీజర్ ఎలా ఉంది..?

ఒక్కణ్ని చంపితే క్రిమినల్ అంటారు.. వేల మందిని చంపితే చక్రవర్తి అంటారు.. ఇదీ సోనూసూద్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న మూవీ టీజర్ లోని డైలాగ్. యస్.. ఇన్నాళ్లూ భీకరమైన విలన్ గా ఆకట్టుకున్న సోనూసూద్ ఈ సారి హీరోగా రాబోతున్నాడు. ఈ చిత్రానికి తనే దర్శకుడు. నిర్మాత కూడా. జాక్వలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ చూస్తే ఈ మధ్య వచ్చిన యానిమల్, కిల్ చిత్రాల నుంచి ఇన్స్ స్పైర్ అయినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్.
టీజర్ లో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా విపరీతమైన హింస, రక్తపాతంతో కనిపిస్తున్నాయి. సోనూసూద్ ఏదైనా ఏజెంట్ గా నటిస్తున్నాడా లేక పోలీస్ ఆఫీసరా అనేది క్లియర్ గా చెప్పలేదు కానీ.. ఫైట్స్ లో తనదైన శైలిలో వేరియేషన్స్ చూపించాడు. ఇలాంటి సినిమాలకు ఫైట్స్ మెయిన్ ఎసెట్. అందుకే వాటిపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత జాక్వలిన్ కు హీరోయిన్ ఆఫర్ వచ్చింది. వీరి పెయిర్ కూడా బావుంది. టీజర్ లో తను అతన్ని అడుగుతుంది.. ఫతే .. నువ్వేం చేస్తుంటావు.. అని. దానికి అతను.. అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటాడు. దీన్ని బట్టి ఆ పాత్రను సినిమాలోనే తెలుసుకోవాలేమో అనుకోవచ్చు.
ఇక జనవరి 10న సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. మరి ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాడా లేక హిందీకే పరిమితం అవుతాడా అనేది చూడాలి. మొత్తంగా చాలామంది ఎన్నాళ్లుగానో సోనూసూద్ ను రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడు రీల్ హీరోగానూ రాబోతున్నాడు. మరి రియల్ హీరో ఇమేజ్ ఈ రీల్ హీరోకు ఎంత పెద్ద ఓపెనింగ్స్ తెస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com