Narne Nithin : ఆయ్ ట్రైలర్ ఎలా ఉంది.. ?

Narne Nithin : ఆయ్ ట్రైలర్ ఎలా ఉంది.. ?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది( భార్య తమ్ముడు) గా మ్యాడ్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నార్నే నితిన్. ఫస్ట్ మూవీలో అతని ఇంప్రెషన్ పెద్దగా కనిపించలేదు. నటన పరంగా బ్లాంక్ గా కనిపించాడు అనే టాక్ వచ్చింది. బట్ సీరియస్ రోల్ కాబట్టి అలా చేశాడేమోలే అని సర్ది చెప్పుకున్నారు కొందరు. అతని రెండో సినిమాను బన్నీ వాస్ నిర్మించాడు. ‘ఆయ్ ’అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఈ నెల 15న విడుదల కాబోతోంది. అదే రోజు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి భారీ సినిమాలున్నాయి. అయినా బ్యాక్ ఎండ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉందనే ధైర్యంతో వీళ్లూ అదే రోజు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

మామూలుగా ఏ ట్రైలర్ అయినా సినిమాపై ఒక అంచనాకు వచ్చేలా చేస్తుంది. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఈ మధ్య కాలంలోనే వచ్చిన రాజావారు రాణివారు మూవీని తలపిస్తోంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొన్నాళ్ల క్రితం వచ్చిన మారుతి ప్రతిరోజు పండగే మూవీలోని రాశిఖన్నా పాత్రను తలపిస్తోంది. అలాగే కో ఇన్సిడెంటో ఏమో కానీ.. ఆయ్ కంటే ఒక వారం ముందు వస్తోన్న కమిటీ కుర్రాళ్లు మూవీలోని క్యాస్ట్ బేస్డ్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉంది. కాకపోతే ఆయ్ లో కులం ప్రేమకు అడ్డుగా ఉంటుంది. పైగా హీరోయిన్ కు సైతం క్యాస్ట్ పిచ్చి ఉంటుంది.

ఓవరాల్ గా చూస్తే ఓ రొటీన్ సినిమా గోదావరి స్లాంగ్ లో రాబోతోందనే ఫీలింగ్ వచ్చిందీ ట్రైలర్ చూస్తే. ఇక జాయ్ ఫుల్ గా ఉండాల్సిన పాత్రలో నార్నే నితిన్ డల్ గానే కనిపిస్తున్నాడు. నటుడుగా మారడానికి కుర్రాడికి ఇంకా చాలా సినిమాలే పట్టొచ్చు అనిపిస్తుంది. అతనితో పాటు కనిపించిన అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య అతనికంటే హుషారుగా ఉన్నారు. హీరోయిన్ నయన్ సారిక నటించింది. మరి ఈ ఆయ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Next Story