Band Melam movie : బ్యాండ్ మేళం మూవీ టీజర్ ఎలా ఉంది..?

కోర్ట్ మూవీతో బాగా ఫేమ్ అయిన జంట హర్ష్ రోషన్, శ్రీదేవి. ఈ ఇద్దరికీ ఆ మూవీ తర్వాత చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ జంటతో ఈ సారి బ్యాండ్ మేళం అనే మూవీ రూపొందుతోంది. కోన వెంకట్ ఈ చిత్రానికి నిర్మాత. అదే ఈ మూవీకి సంబంధించి పెద్ద విశేషంగా ఉందని చెప్పాలి. దర్శకుడు సతీష్ జవ్వాజి. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి స్పందనే వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
సింపుల్ గా చూస్తే ఇది కూడా టీనేజ్ లవ్ స్టోరీలాగానే కనిపిస్తోంది. హర్ష్, శ్రీదేవి ఇద్దరూ బావా మరదళ్లుగా నటించినట్టుగా కనిపిస్తోంది. శ్రీదేవి ఒరిజినల్ క్యారెక్టర్ లాగా తను విపరీతంగా రీల్స్ చేయడం టీజర్ లో ఉంది. సాయి కుమార్ అమ్మాయి తండ్రిగా ఆ రీల్స్ లో కూడా నటిస్తుండటం కనిపిస్తుంది. ఇక బావా మరదళ్లు అయినా ఇద్దరి మధ్య ఎప్పుడూ తగాదాలు, గొడవలు మాత్రమే కనిపిస్తుంటాయి. చివర్లో ప్రేమలో పడిపోతారు అనేది కామన్ గా కనిపించే అంశం. టీజర్ అయితే మరీ కొత్తగా ఏం లేదు. కాకపోతే టీనేజ్ లవ్ స్టోరీలో ఉండేలా డబుల్ మీనింగ్స్, ఎక్స్ పోజింగ్ లేకుండా బానే ఉన్నట్టుగా ఉంది. సినిమా మార్చి ౧౩న విడుదల కాబోతోంది. ఈ జంటకు ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో పాటు క్యాష్ కూడా తెచ్చేంత పెద్ద కంటెంట్ ఏమైనా ఉందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
