Hey Bhagavan trailer : హే భగవాన్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది..?

సుహాస్ హీరోగా వరుస మూవీస్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ వైవిధ్యమైన సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తను హీరోగా నటించిన మూవీ హే భగవాన్. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. అతనో బిజినెస్ మేన్ గా ప్రొజెక్ట్ చేస్తూ సాగింది ఆ టీజర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మరి ట్రైలర్ చూస్తే ఈ సారి అతని బిజినెస్ ఏంటీ అనేది అసలు తెలియకుండా మ్యానేజ్ చేశారు. అతను ఏదో బలంగా ఒక వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అదేంటీ అనేది తెలియకుండా చేశారు.
హీరో, హీరోయిన్ తో వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కట్ చేస్తే అసలా బిజినెస్ గురించి అతను క్లారిటీగా ఉండడు. దీంతో పాటు కొందరు గూండాల కూడా ఎంటర్ అవుతారు. దీంతో ప్రేమలో ఉన్న ఇద్దరూ సమస్యల్లో పడిపోతుంటారు. సింపుల్ గా చూస్తే అతను ఏ పనీ చేయడు.. అతని తండ్రికి కూడా ఏదో వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ అతనూ ఏం చేయడు. ఏదో చేస్తాం అనే బిల్డప్ తోనే సాగిపోతుంది. అందుకే ఈ హే భగవాన్ అనే సందర్భాలు చాలానే ఉంటాయి కదా.. ఆ కారణంగా ట్రైలర్ వరకు ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా కాన్సెప్ట్ బేస్డ్ గా సాగే కామెడీ మూవీలా అనిపిస్తోంది.
సుహాస్, శివానీ నగరం జంటగా నటించారు. సీనియర్ నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. గోపీ అచ్చర డైరెక్ట్ చేసిన ఈ మూవీకి బి. నరేందంద్ర రెడ్డి నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇక ఈ నెల 20న విడుదల కాబోతోన్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
