Vishwaksen : మెకానిక్ రాకీ సెకండ్ ట్రైలర్ ఎలా ఉంది..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ. ఈ నెల 22న విడుదల కాబోతోందీ మూవీ. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేశాడు. రజని తాళ్లూరి నిర్మాత. ఆ మధ్య విడుదలైన మెకానిక్ రాకీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ ఇమేజ్ కు తగ్గ కంటెంట్ లా కనిపించింది. రీసెంట్ గా వరంగల్ లో మరో ట్రైలర్ విడుదల చేస్తా అన్నాడు విశ్వక్. బట్ అప్పుడు కుదరలేదు. తాజాగా మెకానిక్ రాకీ 2.0 అంటూ మరో ట్రైలర్ విడుదల చేశాడు.
ఫస్ట్ ట్రైలర్ కు కొనసాగింపులానే కనిపిస్తోందిది. రెగ్యులర్ గా సినిమావాళ్లు ఒక డైలాగ్ చెబుతుంటారు. మాది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని. ఆ మాటకు అర్థం చెప్పేలా ఉందీ ట్రైలర్. ఒక పార్ట్ అంతా ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్. ఎంటర్టైన్మెంట్ పార్ట్. తర్వాత భాగంలో యాక్షన్ తో పాటు కాస్త సెంటిమెంట్ ను కూడా రంగరించారు. ఓ రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఫార్మాట్ లోనే ఈ చిత్రం రాబోతోందని ఈ ట్రైలర్ తో తేలిపోయింది. కాకపోతే ఆ కథను ఎంగేజింగ్ గా చెప్పగలిగితే హిట్ టాక్ వచ్చేస్తుంది. విశ్వక్ సేన్ కూడా దర్శకత్వం చేసినవాడే కాబట్టి.. ఈ ఎమోషన్ ఏ మేరకు ఉండాలో తెలిసు. అందుకే గత నెలలోనే విడుదల కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేసి అన్ని మసాలాలు సమపాళ్లలో సెట్ చేసుకుని ఈ 22న వస్తున్నాడు. సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఈ రెండు ట్రైలర్స్ మాత్రం సాధారణ కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోనే కనిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com