Superman trailer : సూపర్ మేన్ అది పేరు కాదు.. దావానలం

సూపర్ మేన్.. మనకు హాలీవుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ సూపర్ మేన్ మూవీస్ లో ‘సూపర్ మేన్’ఎక్కువగా కనెక్ట్ అయింది. ఆ సిరీస్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఆ తర్వాత చాలామంది రకరకాల పేర్లతో సూపర్ మేన్ లుగా వచ్చారు. ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చాయి. కొందరు అలరించారు. మరికొందరు ఇబ్బంది పెట్టారు. బట్ ఒరిజినల్ సూపర్ మేన్ అంటే వాల్డ్ వైడ్ ఆడియన్స్ కు ఓ ఎఫెక్షన్. ఆ ఎఫెక్షన్ ను మరోసారి క్రియేట్ చేసింది ‘డి.సి స్టూడియోస్’.
డేవిడ్ కోరెన్ స్వెట్ ఈ సారి సూపర్ మేన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సూపర్ మేన్ డ్యూయొల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అదో విశేషం అనే చెప్పాలి. ఫీమేల్ లీడ్ లో రేచల్ బ్రోస్నన్, నెగెటిల్ రోల్ లో నికోలాస్ హోల్ట్ నటిస్తున్నారు. జేమ్స్ గన్ డైరెక్ట్ చేయడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడీ చిత్రానికి.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ను ఏకంగా అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ లో డబ్బింగ్ పై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. కానీ సూపర్ మేన్ గా అతను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సూపర్ మేన్ తను ఓ ఇంటర్వ్యూ ఇస్తూ గత పార్ట్ లో దొర్లిన తప్పులను గురించి ప్రస్తావిస్తుంటే కాస్త అసహనానికి గురవుతాడు. ఆ తర్వాత వరుసగా అతను చేసిన కొన్ని సంఘటనలు, తర్వాత తను మళ్లీ ప్రపంచాన్ని కాపాడటానికి చేసిన సాహస కార్యాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కళ్లు చెదిరే విజువల్స్ తో పాటు అదిరిపోయే యాక్షన్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో ‘సూపర్ మేన్.. వాడు మనిషి కాదు. కేవలం పేరే. కానీ ఆ పేరు అడవిలో దావానలంలా ప్రపంచం అంతా వ్యాపించింది. ఆ దావానలాన్ని నేను ఆర్పేస్తాను’ అనే డైలాగ్ తో పాటు వచ్చే విజువల్స్ మాత్రం ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ది బెస్ట్ క్వాలిటీ ఉంది. ఈ యేడాది జూలైలో విడుదల కాబోతోన్న సూపర్ మేన్ ఈ సారి వాల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసేలానే కనిపిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com