Sri Vishnu : శ్రీ విష్ణు మృత్యుంజయ్ టీజర్ ఎలా ఉంది

శ్రీ విష్ణు వరుస మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. కథల్లో కొత్తదనం లేకపోయినా తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన విష్ణు విన్యాసం మూవీతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మూవీ కంటే ముందు విడుదల కావాల్సిన మూవీ మృత్యుంజయ్. ఈ నెల 27నే విడుదల కావాల్సిన మృత్యుంజయ్ ని ఒక వారం వెనక్కి నెట్టారు. మార్చి 6న ఆ మూవీ విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బావుంది. చూడగానే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు శ్రీ విష్ణు చేసిన మూవీస్ కు భిన్నంగా థ్రిల్లర్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
శ్రీ విష్ణు మృత్యుంజయ్ లో రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఓ మర్డర్ కేస్ లో నిజాలేంటీ అనేది కనిపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. ఆ మర్డర్ బాలాదిత్యదే. అతని కూతురు ఏడ్వడం కూడా మానేస్తుంది. ఆ పాపలో ఏడుపు చూసేందుకు శ్రీ విష్ణు ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది కనిపెట్టాలనుకుంటాడు. ఒకరిని మించి ఒకరిని అనుమానిస్తుంటాడు. పోలీస్ లు ఇది కేవలం సాధారణ మరణం అని చెబుతారు. అయినా అతను మాత్రం ఇది మర్డర్ అనే నమ్ముతాడు. ఈ హత్య ఎవరు చేశారు అనేది అతను కనిపెడతాడు. కనిపెట్టడం కూడా ట్రైలర్ లోనే చూపించారు. ట్రైలర్ లోనే హంతకుడు ఎవరు అనేది చూపిస్తే థ్రిల్ ఏముంటుంది. బట్ అయినా చూపించారు అంటే అంతకు మించి థ్రిల్ ఇంకేదో ఉన్నట్టుగా ఉంది. మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా బావుంది.
మృత్యుంజయ్ లో శ్రీ విష్ణుకు హీరోయిన్ ఉండదు అని ముందే చెప్పారు. బట్ పోలీస్ పాత్రలో రెబా జాన్ పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్. అతనికి ఇది ఫస్ట్ మూవీ. సందీప్ గుణపం, వినయ్ చిలకపాటి నిర్మాతలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
