Suriya : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ఎలా ఉంది..?

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సూర్య మూవీ అంటే ఈ మధ్య కాలంలో అన్నీ పోతున్నాయి. అందుకే ఆ రూట్ మార్చాడు. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ తెలుగు మూవీతో వస్తున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి. నిర్మాత నాగవంశీ. ఇంకేం.. హిట్ గ్యారెంటీ అనిపించేలా ఉంది ఈ కంటెంట్ తో. యస్.. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూడగానే సినిమా ఎలా ఉండబోతోంది అనే అంచనాకు రావొచ్చు అనిపించేలా ఉంది. అంటే సినిమాలో బలమైన కథ ఉండబోతోంది అనేలా అన్నట్టు.
సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కంటి చూపుకు 20ల్లో ఉండే షార్ప్ నెస్ 40ల దాటిన తర్వాత ఉండదు.అంటూ మొదలైంది టీజర్. తనతో పాటు హీరోయిన్ మమితా బైజు పాత్ర ఎంటర్ అవుతుంది. తన పాత్ర చాలా బబ్లీగా ఉండబోతోంది అనిపించేలా ఉంది. తెగ తిండిపోతుగా, డబ్బంటే లెక్కలేని అమ్మాయిగా తను కనిపించబోతోంది. అలాంటి తను 40ల దాటిన తర్వాత హీరోతో ప్రేమలో పడుతుంది. ఆ విషయం హీరో అందుకు ఒప్పుకోడు. పైగా నాకంటే 20యేళ్లు చిన్నదైన అమ్మాయితో ప్రేమేంటీ, పెళ్లేంటీ అని అంటుంటాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం అస్సలు లైట్ తీసుకోదు. దీనికి అతను ‘నువ్వొక చిటికెస్తే నీ వయసు అబ్బాయిలు చాలామంది వచ్చి పడిపోతారు’అంటాడు. దానికి ఆ అమ్మాయి ‘కావాలంటే నాలుగు చిటికెలు వేస్తా .. పడు’ అంటుంది. మరి ఈ ఇద్దరి కథ ఎలాంటి తీరాలకు వెళుతుంది. ఇద్దరి మధ్య ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు.
ఈ మూవీ ఈ యేడాది జూలైలో విడుదల కాబోతోంది అని చెప్పింది టీమ్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సూర్య, మమితాతో పాటు రాధికా, రవీనా టాండన్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
