Vishnu Vinyasam Trailer : విష్ణు విన్యాసం మూవీ ట్రైలర్ ఎలా ఉంది..?

Vishnu Vinyasam Trailer :  విష్ణు విన్యాసం మూవీ ట్రైలర్ ఎలా ఉంది..?
X

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. కెరీర్ ఆరంభంలో అన్నీ సీరియస్ మూవీస్ చేశాడు. బట్ ఇప్పుడు ట్రెండ్ మార్చాడు. మాగ్జిమం వినోదాత్మకమైన చిత్రాలే చేస్తున్నాడు. వాటితోనే విజయాలు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకేసారి రెండు మూవీస్ విడుదల కావడం అతనికి ఫస్ట్ టైమ్. మామూలుగా చూస్తే ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కావాల్సి ఉంది. బట్ ఒక మూవీని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అదే విష్ణు విన్యాసం. ఆ మూవీ కంటే ముందు మృత్యుంజయ్ విడుదల కాబోతోంది. మృత్యుంజయ్ ఈ నెల 27న విడుదలవుతుంది. ఆ తర్వాతి రోజు విష్ణు విన్యాసం రాబోతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా రూపొందించారని తెలుస్తోంది. శ్రీ విష్ణు హీరోయిన్ నయన్ సారిక జంట బావుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. కథ పరంగా చూస్తే ముందుగా హీరోయిన్ అతనితో ప్రేమలో పడుతుంది. తర్వాత ఇద్దరి మధ్య లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆపై హీరోయిన్.. హీరో వద్దకు వెళ్లి తనకో మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. అది తప్పు అని తెలిసినా కారణాలేంటో తెలియదు కానీ అతను ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి మొదలవుతుంది ఇద్దరి మధ్య అసలైన యవ్వారం అన్నట్టుగా సాగుతుంది. ఆమె కోసం మరో అబ్బాయిని వెదికే పనిలో అతను నానా తంటాలు పడటం, అలాగే మరికొందరితో అతను మాటలు పడటం ఇవన్నీ కూడా ఎంటర్టైనింగ్ గానే సాగుతుంది. ఇంతకీ అమ్మాయి.. మరో అబ్బాయిని ఎందుకు చేసుకోవాలనుకుంది అనేది సినిమాలో చూస్తే తెలుస్తుంది.

మొత్తంగా ట్రైలర్ ఎంటర్టైన్మెంట్ తోనే నింపేశారు. శ్రీ విష్ణు ఎప్పట్లానే తనదైన టైమింగ్ తో అదరగొట్టాడు. నయన్ సారిక చూడ్డానికి చాలా బావుంది. వీరితో పాటు సత్య, మురళీ శర్మ, సత్యం రాజేష్ ల పాత్రలు కూడా బాగా ఆకట్టుకునేలానే ఉన్నాయి. యధునాథ్ మారుతి రావు దర్శకత్వం చేసిన ఈ చిత్రానికి సుమంత్ నాయుడు నిర్మాత. రధన్ సంగీతం అందించాడు. ఇక ఈ నెల 28న విడుదల కాబోతోన్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Next Story