Harihara Veera Mallu : హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఈగర్ గా ఎదురుచూస్తోంది. ఎన్నాళ్లుగానో ఆగుతూ, సాగుతూ వచ్చిన ఈమూవీ ఫైనల్ గా ఈ నెల 24న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అప్పుడు కూడా ట్రైలర్ ఎప్పుడు అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. సో.. అందరి కోసం వీరమల్లు ట్రైలర్ విడుదలైంది.
‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.. ’అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆ కాలం నాటి పరిస్థితులును ఎలివేట్ చేసే విజువల్స్ తో ఉంది. గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు.. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు.. ’.. ‘ఇది నేను రాసిన చరిత్ర.. సింహాసనమా.. మరణ శాసనమా’వంటి డైలాగ్స్ తో ఆనాటి బాద్ షాల దురాగతాలను చూపుతుంది. ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకు రావడానికి తిరుగులేని రామబాణం కావాలి.. అంటూ తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ కనిపిస్తుంది. అప్పటి నుంచి వరుసగా యుద్ధాలు, ఫైట్ సీన్స్ తో నండిపోయి ఉంది ట్రైలర్.
ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. పవన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చే అవకాశాలున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హైలెట్ గా ఉండబోతున్నాయనేది అర్థం అవుతుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వరుసగా దూసుకువస్తోన్న ఈటెలను ఛేదిస్తూ పవన్ చేసిన విన్యాసం అదిరిపోయింది. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది కాబట్టి ఇవన్నీ నేచురల్ గానే ఉన్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు విలన్ గా బాబీ డియోల్ ను ఎక్కువగా ఎలివేట్ చేయలేదు. పవన్ చుట్టూనే ట్రైలర్ తిరిగింది. మేకింగ్ పరంగా చూస్తే ఇంకాస్త బెటర్ క్వాలిటీ ఉండొచ్చేమో అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ సైతం బెటర్ గా ఉంటే బావుండేదేమో. సినిమాలో ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ లో కాస్త తేలిపోయినట్టుగానే ఉన్నాయి.
ఓవరాల్ గా చూస్తే.. ఈ మధ్య కాలంలో వచ్చిన రుద్రమదేవి, సైరా, ఛావా మూవీస్ లను ఫాలో అయినట్టుగా ఉంది. కంటెంట్ పరంగా చూస్తే కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని తీశారా అనే డౌట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో.. ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ ట్రైలర్ కట్ కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com