Vrushakarma Glimpse : వృషకర్మ మూవీ గ్లింప్స్ ఎలా ఉంటుంది

Vrushakarma Glimpse :  వృషకర్మ మూవీ గ్లింప్స్ ఎలా ఉంటుంది
X

నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న మూవీ వృషకర్మ. విరూపాక్ష వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే సింపులీ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. హారర్, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడిన కథలా ఉండబోతోంది ఈ మూవీ అనిపించేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మరో స్థాయిలో ఉండబోతున్నాయి అనేలా ఉంది. అసలు ఈ తరహా మూవీస్ ను మన నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించొచ్చా అంటే అవును అనే చెప్పాలి. టైటిల్ కు తగ్గట్టుగా కథ, కథనం ఉండబోతున్నాయి అనిపిస్తోంది.

ఒక మనిషికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. వాటితో అతను లోక నాశనాన్ని కోరుకుంటాడు. ఆ క్రమంలో అనేక అకృత్యాలు చేస్తూ ఉంటాడు అతను. అతన్ని ఎదురించే మొనగాడు వచ్చేంత వరకు అతని ఆటలు సాగుతాయి. ఆ మొనగాడు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది అనేలా ఉంది. అందుకే ఈ గ్లింప్స్ లో ‘అతీంద్రియ శక్తులు పుట్టినప్పుడు, స‌ృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక విష కర్మను ఎంచుకుంటుంది’ అనే వాయిస్ ఓవర్ ఉంది. ఈ కథ కూడా మొత్తం ఆ లైన్ మీదే ఆధారపడి ఉంటుంది అనిపించేలా ఉంది.

మొత్తంగా నాగ చైతన్య ఈ సారి మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు అనేలా ఉంది. మీనాక్షి చౌధరి హీరోయిన్ గా నటిస్తోంది. జయరామ్, స్పర్శ్ శ్రీవాత్సవ, సత్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీ గ్లింప్స్ మాత్రం బావుంది.

Tags

Next Story