NTR 100 Crores Movies : ఎన్టీఆర్ ఖాతాలో 100 కోట్ల సినిమాలు ఎన్ని ఉన్నాయి..?

ఇప్పుడంటే ఈజీగా వంద కోట్లు కొల్లగొడుతున్నారు కానీ.. ఒకప్పుడు 50 కోట్లు సాధించిన హీరోలంటే ఓ గొప్పగా చూశారు. ఆ తర్వాత 75 కోట్లు. ఆపై 100 కోట్లు. హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ అని ముద్దుగా పిలుచుకున్న ఈ లిస్ట్ లో చేరాలని ప్రతి హీరో కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఈ ట్రెండ్ బాగా పెరిగింది. 100 కోట్ల క్లబ్ లో లేకపోతే టాప్ ఫైవ్ లో లేనట్టే అన్నట్టుగా మాట్లాడారు. ప్రస్తుతం 500 - 10000 కోట్ల క్లబ్స్ గురించి మాట్లాడుతున్న కాలంలో ఉన్నాం. పైగా ప్యాన్ ఇండియా ట్రెండ్ ఇంకా పెరిగింది. మరి దేవరతో ఈ లిస్ట్ లోకి ఎంటర్ కావాలని చూస్తోన్న ఎన్టీఆర్ ఖాతాలో 100 కోట్లు సాధించిన సినిమాలున్నాయా.. ఉంటే ఎన్ని ఉన్నాయి..? అనేది చూద్దాం.
2010లో వచ్చిన అదుర్స్, బృందావనం వంటి హిట్స్ తర్వాత ఎన్టీఆర్ కు 2015లో టెంపర్ వచ్చే వరకూ బాద్ షా మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది. మధ్యలో అన్నీ ఫ్లాపులే. మరోవైపు మహేష్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు ఆల్రెడీ 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఎన్టీఆర్ ను ఆ క్లబ్ లోకి చేర్చిన మొదటి సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోసం ఫస్ట్ టైమ్ తన మేకోవర్ ను కూడా మార్చాడు. దానిపై అనుమానంతోనే ఆడియన్స్ ముందుకు వచ్చాడు జూనియర్. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ మూవీలోని అన్ని పాటలకూ ఎన్టీఆర్ స్టెప్స్ కు ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారు. నాన్నకు ప్రేమతో 132 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అతన్నీ 100 క్లబ్ లోకి చేర్చింది.
ఆ తర్వాత అప్పటికే శ్రీమంతుడుతో 100 కోట్ల క్లబ్ లో ఉన్న కొరటాల శివతో చేసిన జనతా గ్యారేజ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర చేసిన ఈ మూవీ అతని కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్పాలి. జనతా గ్యారేజ్ 134 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఇందులో ఎన్టీఆర్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలామందికి నచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు హ్యాట్రిక్ కూడా అవుతుందని.. భారీ అంచనాల మధ్య వచ్చిన జై లవకుశ సైతం అంచనాలను అందుకుంది. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేశాడీ మూవీలో. రెగ్యులర్ ఫార్మాట్లోనే వచ్చినా..చివరి అరగంట ఎన్టీఆర్ నటనకు ఎంటైర్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆ ఎపిసోడ్ లోని ఎమోషన్ కు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుున్నారు. ఆ స్థాయిలో తన నటనతో మెప్పించాడు తారక్. ఈ మూవీ 175 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ రేంజ్ ను మరింత పెంచింది.
హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న తర్వాత అరవింద సమేత వీరరాఘవ చేశాడు. బట్ ఈ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుంది అనుకోలేదెవరూ. కారణం.. త్రివిక్రమ్ దానికి ముందు అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ తో ఉన్నాడు. అందుకే ఈ మూవీ చేయొద్దని ఎన్టీఆర్ ను చాలామంది వారించారు. అయినా అతను పట్టించుకోలేదు. తన అద్భుతమైన నటనతో మరోసారి కట్టి పడేశాడు. అరవింద సమేత బాక్సాఫీస్ వద్ద 165 కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఈ మూవీ ఎక్స్ పెక్టేషన్స్ ను పూర్తిగా రీచ్ కాలేదు. ఒకవేళ అంచనాలను మించి ఆకట్టుకుని ఉంటే ఖచ్చితంగా 200 కోట్ల మార్క్ ను టచ్ చేసేదే అంటారు విశ్లేషకులు.
ఆర్ఆర్ఆర్ 1200 కోట్లకు పైగా సాధించినా అది పూర్తిగా ఎన్టీఆర్ అకౌంట్ లో వేయలేం. మొత్తంగా ఎన్టీఆర్ అకౌంట్ లో 100 కోట్లు సాధించిన సినిమాలు సోలోగా 4 ఉన్నాయి. మరి దేవర రికార్డులు బ్రేక్ చేసి 500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తే ఆ ఫీట్ సాధించిన హీరోగా మరో స్థాయికి వెళ్లిపోతాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com