NTR Devara : సముద్రం మళ్లీ ఎరుపెక్కింది జోగులా..

'నిన్న రేత్రి ఓ పీడకల ఒచ్చుండాది జోగులా.. అదీ నా చేతుల మీదుగా అయినట్టుగా కనిపిచ్చుండాది..' అంటూ దేవర నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్ లో ఇదే బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్ ట్రైలర్ విషయంలో అనేక డౌట్స్ వచ్చాయి. ముఖ్యంగా అనిరుధ్ ఆర్ఆర్ తో పాటు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో చాలా కమెంట్స్ వినిపించాయి. ఇది ఖచ్చితంగా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తుందని భావించారు చాలామంది. బట్ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడు కొరటాల శివ. ఫస్ట్ ట్రైలర్ లో దేవరను హైలెట్ చేస్తే ఈ ట్రైలర్ లో అతని కొడుకు వరదను హైలెట్ చేస్తూ కనిపించింది. ఈ సారి అనిరుధ్ అదరొట్టాడు. అప్పుడు టైమ్ లేనట్టుగా ఉంది.
'భయం పోవాలంటే దేవుడి కథ ఇనాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాలా..", "సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు.. కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా..", 'ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా.. మన అనుకునేవాళ్లెవరూ మనోళ్లు కాదు..', ' సముద్రం ఎక్కాలా.. సముద్ర ఏలాలా..', ' దేవర అడిగినాడంటే సెప్పినాడనీ.." అనే డైలాగ్స్ ట్రైలర్ మొత్తం హైలెట్ గా కినిపిస్తూనే ఉన్నాయి.
ఇక సముద్రంలో షార్క్ ను కంట్రోల్ చేసే విజువల్స్ తో పాటు సముద్రం అడుగున అనేక అస్తి పంజరాలు కనిపించడం ఒళ్లు గగుర్పొడిచేలా కనిపిస్తోంది. భైరాతో యాక్షన్ సీక్వెన్స్ సైతం ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజానికి ఇలాంటి కంటెంట్ తో ముందే వచ్చి ఉంటే ఈ మూవీపై ఉన్న చాలా నెగెటివిటీ ఇప్పటి వరకూ వినిపించేది కాదు. మొత్తంగా ఈ ట్రైలర్ వల్ల చాలా క్లియర్ గా అర్థం అయింది ఏంటంటే.. అనిరుధ్ మరోసారి తనదైన శైలిలోసినిమాను నిలబెట్టబోతున్నాడని.. యంగ్ టైగర్ నుంచి ఇంతకు ముందెప్పుడూ చూడనంత అగ్రెసివ్ నెస్ చూడబోతున్నామని. మొత్తంగా ఈ ట్రైలర్ తో చాలా నెగెటివ్ టాక్ ను ఆపేశారు అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com