Hrithik Roshan: భార్యతో విడాకులు.. త్వరలోనే ప్రియురాలితో బాలీవుడ్ నటుడి పెళ్లి..

Hrithik Roshan (tv5news.in)
Hrithik Roshan: సినీ పరిశ్రమల్లో విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ముందుగా ఈ కల్చర్ బాలీవుడ్‌లోనే మొదలయ్యింది. నటీనటులు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని మనస్పర్థలు రాగానే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేవారు. అలాగే హృతిక్ రోషన్ కూడా పెళ్లయిన 14 సంవత్సరాలు తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చాడు. తాజాగా తన ప్రియురాలితో త్వరలోనే హృతిక్ పెళ్లి పీటలెక్కనున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
హృతిక్ రోషన్.. 2000లో సుసానే ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ ఏమైందో తెలీదు.. వీరిద్దరు 2013లో విడిపోతున్నట్టు ప్రకటించారు. 2014లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దాని తర్వాత కంగనా రనౌత్‌తో హృతిక్ డేటింగ్ చేస్తున్న విషయంలో బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మరో నటి సభా ఆజాద్‌తో హృతిక్ డేటింగ్ చేస్తున్నాడంటూ, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.
సభా ఆజాద్ కేవలం బాలీవుడ్‌లో నటిగానే కాకుండా సింగర్‌గా కూడా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తోంది. గత కొంతకాలంగా సభా.. హృతిక్‌తో ఎక్కువగా సమయం గడుపుతున్నట్టు బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. దీనిపై వీరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు ఈ వార్తలు నిజమో కాదో తెలీదు అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com