చూపు తిప్పుకోనివ్వని హృతిక్ బాడీ బిల్డింగ్..!

చూపు తిప్పుకోనివ్వని హృతిక్ బాడీ బిల్డింగ్..!
అతని శరీరం చీల్చినట్టు, ఉలితో చెక్కినట్లు ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు


బాలీవుడ్ సూపర్ స్టార్ హిృతిక్ రోషన్ తన స్టైల్ తో కండలు తిరిగిన శరీరంతో అమ్మాయిలను ఇట్టే పడేస్తాడు. ఆయన మాస్ లుక్, ఫిట్ నెస్ మగవాళ్లకు సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. వయసు 50కి దగ్గరైనా శరీరాకృతిమాత్రం 25లోనే ఉంది. తాజాగా ఆయన జిమ్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూన్ 19న హిృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో చొక్కాలేకుండా ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు అతని ఫిజిక్ ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులో మహిళా అభిమానులే కాకుండా మగవాళ్లూ ఉన్నారు.

హిృతిక్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నాడు. అందుకుగాను 'బ్యాక్ డే.. డెవిల్ విత్ హార్న్స్' అనే ఏమోజీని జోడించి ఉంది. ఈ ఫొటోలో అతని శరీరం చీల్చినట్టు, ఉలితో చెక్కినట్లు ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు. షర్ట్ ను తీసివేసి, బ్లాక్ జాగర్స్ షూస్ వేసుకుని, నల్లటి బేల్ క్యాప్ పెట్టుకుని కనిపించాడు.

హృతిక్ ప్రియురాలు సబా ఆజాద్ కూడా ఫొటోపై స్పందించారు. నెటిజన్లయితే అతన్ని గ్రీక్ గాడ్ ఫర్ ఎ రీజన్ అంటూ కొనియాడారు. హిృతిక్, సబా ఆజాద్ కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. వీరి మధ్య బంధం బలంగా ఉందని చెప్పారు. తొందరలోనే దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కలిసి పనిచేయనున్నాడు. అందులో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా తర్వాత అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'వార్ ౨' లో నటించనున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, కియారా అడ్వానీ స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story