Hrithik Roshan : నా కెరీర్ లో ఎన్టీఆర్ బెస్ట్ కో స్టార్

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనిపించుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన ఈ మూవీ అదే స్థాయిలో విజయమూ సాధించింది. ఆస్కార్ వరకూ వెళ్లింది. ఆ తర్వాత ఆ రేంజ్ మల్టీస్టారర్ అంటే ‘వార్2’ అనే చెప్పాలి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
వార్ 2 షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక్క పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా ఇద్దరు హీరోలపై. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ చూసిన తర్వాత మరోసారి ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ తో పాట అంటే నాటు నాటు స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే ఈ పాట కోసం రిహార్సల్స్ చేస్తుండగా హృతిక్ గాయపడ్డాడు. ఆ కారణంగా లేట్ అయింది. ఇక తాజాగా ఓ ఈవెంట్ లో హృతిక్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుష్ చేసేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ తన బెస్ట్ కో స్టార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు హృతిక్. అంతే ఈ మూవీలోని పాట కోసం అతనితో స్టెప్పులు వేయాలంటే నేను నెర్వస్ గా ఫీలవుతున్నా అని చెప్పాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ స్టెప్పులకు హృతిక్ ఎంత ఫిదా అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com