NTR War 2 : ఎన్టీఆర్ పై హృతిక్ పోస్ట్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మూవీ వార్ 2. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న ఆడియన్స్ ముందుకు రాబోతోందీ చిత్రం. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈమూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఏజెంట్స్ మూవీలో భాగంగా రూపొందుతోన్న చిత్రం ఇది. వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో అడుగుపెడుతూ.. చాలా పవర్ ఫుల్ రోల్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడంటున్నారు. వార్ 2 లో సెకండ్ హాఫ్ సగం వరకూ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ లాగా ఆ తర్వాత దేశభక్తి ఉన్న ఏజెంట్ లా కనిపిస్తాడని.. ఈ ట్విస్ట్ సినిమాలో మామూలుగా ఉండదు అనే టాక్ ఉంది. ఇక హృతిక్ ఓ ఏజెంట్ గా ఎన్టీఆర్ పట్టుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళతాడు అంటున్నారు. ఏదేమైనా ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఆ సందర్భంగా వార్ 2 నుంచి ఓ సాలిడ్ టీజర్ వస్తుంది అనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి ఇలా హీరోల బర్త్ డేస్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చే సంప్రదాయం లేదు. బట్ ఈ సారి ఆ సంప్రదాయం దాటేశారు. యస్.. వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ రాబోతోంది. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ కన్ఫార్మ్ చేశాడు.
ఎన్టీఆర్ బర్త్ డే డేట్ ను కోట్ చేస్తూ హృతిక్ రోషన్ తన ఎక్స్ ఖాతాలో ‘హే తారక్.. ఈ నెల 20న ఏ జరగబోతోందో ఊహించి ఆలోచించు.. నన్ను నమ్ము. ఖచ్చితంగా ఏం రాబోతోందో నీకు అస్సలు ఐడియా ఉండి ఉండదు. రెడీ’.. అని చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ వార్ 2నుంచి రాబోతోందని తేలిపోయింది. మరి అది టీజరా ఇంకేదైనానా అనేది చూడాలి. బట్ ఏ మాటకామాట.. హృతిక్ ట్వీట్ తో ఈ మూవీకి సంబంధించిన బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com