Devara Tickets : దేవర టికెట్స్ కు భారీ డిమాండ్

Devara Tickets :  దేవర టికెట్స్ కు భారీ డిమాండ్
X

దేవర సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. కల్కి తర్వాత భారీ సినిమాలేవీ లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటం.. వంటి అంశాలతో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందనే అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. ఓ రకంగా ఎన్టీఆర్ ఆతో పాటు, కొరటాల శివపైనా గట్టి ఒత్తిడి కూడా కనిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చాలా 'కాన్ఫిడెంట్ గా నెర్వస్' ఫీలవుతున్నా అన్నాడు.

దేవర మిడ్ నైట్ షోస్ కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ డిమాండ్ ను చూసి టికెట్ ధరలను కూడా అమాంతంగా పెంచేస్తున్నారు. మొదట వెయ్యి రూపాయలుగా ఉంటుందనుకున్న టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. థియేటర్స్, డిమాండ్ ను బట్టి ఒక్కో టికెట్ కు 1500 - 2500 వరకూ ధర చెబుతున్నారు. అయినా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లకు విపరీతమైన ఫోన్స్ కూడా వస్తున్నాయట.

ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా కల్కి రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. రికార్డ్స్ అనేవి కంటెంట్ పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మేకర్స్ తమ సినిమాలో బలమైన కంటెంట్ ఉందని నమ్ముతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దేవర మానియా బాగా కనిపిస్తోందనే చెప్పాలి. సో.. ఎర్లీ మార్నింగ్ వరకూ సినిమా సత్తా ఏంటో తెలిసిపోతుంది.

Tags

Next Story