Good Bad Ugly Collections : రెండో రోజే తగ్గిన కలెక్షన్స్

తమిళ్ టాప్ స్టార్స్ లో ఒకడైన తలా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పూర్తిగా అరవ అతి సినిమాగా తేల్చేశారు తెలుగు ప్రేక్షకులు. బట్ తమిళ్ లో మాత్రం ఫ్యాన్స కు ఫుల్ మీల్స్ లా ఉంది అనే టాక్ వినిపించింది. దర్శకుడు అజిత్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ మూమెంట్స్ ను సినిమాలో చాలానే రీ క్రియేట్ చేశాడు. ఆ సీన్స్ కు విజిల్స్ పడుతున్నాయి. అయితే కంటెంట్ పరంగా చూస్తే అంత గొప్పగా ఏం అనిపించలేదు. బలమైన విలన్ లేకపోవడం పెద్ద మైనస్ అయితే గ్యాంగ్ స్టర్ గా అజిత్ ను చూపించే ప్రయత్నంలో అక్కడక్కడా ఎలివేట్ చేశాడు తప్ప.. బాషా రేంజ్ లో ఎలివేషన్స్ లేవు. అలాగే ప్రతి సీన్ లోనూ అతన్ని ఎలివేట్ చేశారు తప్ప.. ఆ ఎలివేషన్ కు తగ్గ సీన్స్ పడలేదు అనే చెప్పాలి. అందుకే తమిళ్ లో కూడా ఈ చిత్రానికి ఆదరణ తగ్గుతోంది.
ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో టాప్ ఓపెనర్ అంటే విజయ్ అనేది అందరికీ తెలుసు. అతన్ని దాటతాడు ఈ చిత్రంతో అనుకున్నారు. విజయ్ దరిదాపుల్లోకి కూడా రాలేదు గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ్ లో మాత్రమే మొదటి రోజు ఈ చిత్రానికి 21.86 కోట్లు వసూలయ్యాయి.ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చిన సినిమా కావడం.. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పై నమ్మకంతో మూవీ వీకెండ్ లో అదరగొడుతుంది అనుకున్నారు. బట్ అందుకు భిన్నంగా ఈ చిత్రానికి రెండో రోజు కేవలం 11.88 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండు రోజుల కలెక్షన్స్ 33.75 కోట్లు అన్నమాట. సో.. చూస్తుంటే పట్టుదల మూవీ తర్వాత అజిత్ కు మరో ఫ్లాప్ తప్పేలా లేదు అంటున్నారు చాలామంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com