Suriya : అదీ సూర్య పవర్.. కానీ మిస్ చేసుకున్నాడు

తమిళ్ స్టార్ సూర్య నటించిన రెట్రో మూవీ విడుదలవుతుంటే చాలామంది.. ఈ సారైనా అతనికో హిట్ పడితే బావుండు అనుకున్నారు. అతనంటే అంత అభిమానం జనాలకు. రిలీజ్ కు ముందు ఈ మూవీపై అంచనాలున్నాయి. పూజాహెగ్డే డీ గ్లామర్ రోల్ తెలుగులో కూడా ఆకట్టుకునేలా చేసింది. తనూ విపరీతమైన ప్రమోషన్స్ చేసింది ఇక్కడ. కార్తీక్ సుబ్బురాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో తమిళనాడులోనూ భారీ అంచనాలు తెచ్చుకుంది. బట్ వాటిని అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయింది. తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లో కూడా రెట్రోకు ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ కలెక్షన్స్ చూస్తే ఓపెనింగ్ డే రోజు ఆశ్చర్య పోయారు చాలామంది.
ఈ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ 40 కోట్లకు పైగా వచ్చాయి. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నా.. సూర్య రేంజ్, ఇమేజ్ తగ్గలేదు అనేందుకు ఈ ఓపెనింగ్స్ ఓ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఉండేవాడు. బ్లాక్ బస్టర్ అంటే 150 వరకూ పోయినా ఆశ్చర్యం లేదు. అతనికి అన్ని భాషల్లోనూ మంచి అభిమానులున్నారు. ఆ ఫ్యాన్ పవర్ వల్లే ఈ ఓపెనింగ్స్ సాధ్యం అయ్యాయి. మరి అతని వంతుగా ఓ హిట్ ఇచ్చి ఉంటే ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లే. బట్ ఈ ఛాన్స్ ను మరోసారి మిస్ చేసుకున్నాడు సూర్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com