Suriya : ఈ ట్రాక్ రికార్డ్ తో అంత రెమ్యూనరేషనా

Suriya :  ఈ ట్రాక్ రికార్డ్ తో అంత రెమ్యూనరేషనా
X

ఓ వైపు హీరోల రెమ్యూనరేషన్స్ వల్లే సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు నిర్మాతలు. మరోవైపు వరుస డిజాస్టర్స్ ఉన్నా.. స్టార్ హీరోల పేరుతో విచ్చలవిడిగా పారితోషికాలు ఇచ్చే నిర్మాతలూ పెరుగుతున్నారు. దీనివల్ల లాభ నష్టాల మేటర్ ఆయా నిర్మాతలే భరించుకుంటారు కాబట్టి ఆడియన్స్ కు దానితో అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు.. భారీ బడ్జెట్ చిత్రం అంటూ రిలీజ్ టైమ్ లో మళ్లీ టికెట్ ధరలు పెంచి దాన్ని ప్రేక్షకుల నుంచే వసూళ్లు చేస్తున్నారు కదా.. కాబట్టి అది ఖచ్చితంగా ప్రేక్షకులకూ నష్టమే.

ఇక చివరి సారిగా వచ్చిన హిట్ మూవీ ఏంటీ అంటే ఠక్కున తను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు హీరో సూర్య. రీసెంట్ గా వచ్చిన రెట్రో కంగువా స్థాయి డిజాస్టర్ గా మిగిలింది. అతను ప్రతిభావంతుడే. కానీ ప్రతి సినిమాతోనూ ఫ్లాపులే చూస్తుంటే అతని సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి ఏం ఉంటుంది. అయినా సూర్యకు ఏకంగా 60 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ హిట్ ఇచ్చే బాధ్యత తీసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.

ఈ బ్యానర్ లో అతను వచ్చే నెల నుంచి ఓ సినిమా చేయబోతున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రానికి సూర్యకు 60 కోట్లు ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి అందులో సగం కూడా లేదు అతని కోలీవుడ్ రెమ్యూనరేషన్. అలాంటి హీరోకు ఇంత పారితోషికం అంటే టూమచ్ అనే చెప్పాలి. అదే టైమ్ లో ఈ బ్యానర్ కు ఓ క్రెడిబిలిటీ ఉంది. వాళ్లు ఎంచుకునే కథల్లోనే సక్సెస్ మంత్రం ఉంది. అందుకే ఈ మూవీ ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ 80 కోట్లకు తీసుకుంది అంటున్నారు. అయితే ఇది అన్ని భాషల్లో కలిపి. సూర్య ఉన్న ఫ్లాపుల పరంపరలో నెట్ ఫ్లిక్స్ అతనిపై ఇంత పెడుతుంది అనుకోలేం. ఇది కేవలం బ్యానర్ వాల్యూతో పాటు దర్శకుడి కోసమే.

వెంకీ అట్లూరి ఇంతకు ముందు రూపొందించిన లక్కీ భాస్కర్ ఓటిటిలోనూ ఊపేసింది. అది కూడా దృష్టిలో పెట్టుకునే ఈ మూవీకి అంత బడ్జెట్ పెట్టారు అనుకోవచ్చు. ఏదేమైనా సూర్యకు అంత రెమ్యూనరేషన్ అనేది కోలీవుడ్ లోనూ సర్ ప్రైజింగ్ గానే చూస్తున్నారు.

Tags

Next Story