Akkineni Nagarjuna : క్యారెక్టర్ తగ్గినా క్యాష్ పెరుగుతోంది..

హీరో అంటే సినిమా అంతా కనిపిస్తాడు. అన్నిటికీ తనే బాధ్యుడుగా ఉంటాడు. హిట్ అయినా ఫ్లాప్ అయినా అతని ఖాతాలోకే వెళుతుంది. బట్ రెమ్యూనరేషన్ గట్టిగానే ఉంటుంది. ఒక వేళ వేరే హీరో సినిమాల్లో నటిస్తే క్యారెక్టర్ లెంగ్త్ తగ్గుతుంది. కథలో తన పాత్ర వరకూ మెప్పిస్తే సరిపోతుంది. హిట్ అయితే మరిన్ని క్యారెక్టర్స్ వస్తాయి. లేదంటే అక్కడితో ఆగిపోతుంది. పైగా రెమ్యూనరేషన్స్ తక్కువ. బట్ ఇది కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులకే. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాలో నటిస్తే క్యారెక్టర్ తగ్గుతుందేమో కానీ.. క్యాష్ పెరుగుతుందని ప్రూవ్ చేశాడు నాగార్జున.
మామూలుగా నాగార్జున రెమ్యూనేషన్ 5-7 కోట్ల మధ్య ఉంటుంది. అయితే సోలో హీరోగా నాగ్ ఛరిష్మా తగ్గిందనేది నిజం. నా సామిరంగా హిట్ అయినా.. మేజర్ షేర్ నరేష్ దే అంటే అతిశయోక్తి కాదు. అందుకే మెల్లగా క్యారెక్టర్స్ వైపుకు టర్నింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ హీరోగా అందుకోనం త పారితోషికం కుబేర సినిమా కోసం అందుకుంటున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కుబేరలో నాగ్ కు 10 నుంచి 12 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. లేటెస్ట్ గా అది డబుల్ అయింది.
రజినీకాంత్ కూలీ మూవీలో చేస్తోన్న క్యారెక్టర్ కోసం నాగ్ కు ఏకంగా 25కోట్లు ఇస్తున్నట్టు టాక్. ఇది ఆయన కెరీర్ లోనే హయ్యొస్ట్ రెమ్యూనరేషన్. అయితే ఇంత ఇవ్వడానికి కారణం.. ఇది కాస్త నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్ కావడమే. అంటే ఓ రకంగా నాగ్ తన కెరీర్ ను ఫణంగా పెడుతున్నట్టే. ఈ క్యారెక్టర్ హిట్ అయితే ఇతర హీరోల సినిమాల్లో కూడా విలన్ గా అడిగే అవకాశం ఉంది. చేయడమా వద్దా అనేది ఆయనిష్టం. ఏదేమైనా సినిమా రిజల్ట్ ను మోయాల్సిన బాధ్యత లేకుండా.. తన పాత్ర పరిధి తగ్గినా.. భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు నాగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com