NTR Devara : దేవర అక్కడా బ్లాక్ బస్టర్ కాబోతోందా

NTR Devara  :  దేవర అక్కడా బ్లాక్ బస్టర్ కాబోతోందా
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది. స్వాతంత్ర్యం అనంతరం కొన్ని తెగలకు సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు చాలా నెగెటివిటీని ఎదుర్కొంది. గ్యారెంటీ డిజాస్టర్ అన్నారు. అంతకు ముందు ఆచార్యతో కొరటాల ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చాడు. ఇటు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ మూవీ చేసిన తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కాబట్టి జక్కన్న సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. దేవర పోతుందనీ అన్నారు. దీనికి తోడు ఫ్యాన్ వార్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకతను సృష్టించాయి. ఇవన్నీ దాటుకుని దేవర బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్న వాళ్లంతా లాభాలు చూశారు. అలాంటి మూవీని ఈ నెల 22న జపాన్ లో విడుదల చేయబోతున్నారు.

దేవర కోసం ఆల్రెడీ జూమ్ మీటింగ్స్ లో ప్రమోషన్స్ చేశాడు ఎన్టీఆర్. ఈ మూడు రోజుల్లో డైరెక్ట్ గా జపాన్ కే వెళ్లి ప్రమోషన్స్ చేస్తాడు అన్నారు. అయితే ఈ చిత్రాన్ని రీసెంట్ కొందరు మీడియా వారికి, అక్కడి సినీ ప్రముఖులకు ప్రీమియర్ గా ప్రదర్శిచారు. చూసిన వాళ్లంతా సూపర్బ్ అనేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. సో.. ఈ మూవీ అక్కడా హిట్ అయితే రజినీకాంత్, ప్రభాస్ లాగా ఎన్టీఆర్ కు కూడా జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.

Tags

Next Story