Hyderabad Old City : పాత బస్తీలో మళ్లీ హై టెన్షన్..

Hyderabad Old City : పాత బస్తీలో మళ్లీ హై టెన్షన్..
X
Hyderabad Old City : హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

Hyderabad Old City : హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. రెండు రోజుల క్రితం ఓ వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ.. ఒక వ్యక్తి వీడియో పెట్టారని సౌత్‌ జోన్‌ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఆ వీడియో వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కేసు నమోదు చేసి.. దానిపై యాక్షన్‌ తీసుకున్నామని తెలిపారు.

హైదరాబాద్‌ పీస్‌ఫుల్‌ వాతావరణంలో ఉందని డీసీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పుకార్లు నమ్మొద్దని ప్రజలు, యువతను కోరుతున్నామన్నారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలకు పర్మిషన్‌ లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోరారు.

Tags

Next Story