Trivikram : త్రివిక్రమ్‌కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు..!

Trivikram : టాలీవుడ్ సినీ సెలబ్రిటీలకి గతకొద్దిరోజులుగా ఫైన్స్ వేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాహనాలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడం నుంచి మొదలైన వ్యవహరం.. ప్రస్తుతం కార్ల బ్లాక్ ఫిల్మ్ లను తొలగించే వరకు చేరింది. ఇప్పటికే ఎన్టీఆర్, మంచు మనోజ్ కార్లకి ఫైన్‌లు వేసిన పోలీసులు.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారుకు ఫైన్ వేశారు. ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో అక్కడికి త్రివిక్రమ్ కారు రావడంతో దానిని అపి.. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి రూ. 700 రూపాయల చలాన్ వేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమాని చేస్తున్నాడు త్రివిక్రమ్.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com