సినిమా

Maa Elections 2021 : 'మా' ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. జీవీ వ్యూహం అదేనా?

Maa Elections 2021 : మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ లు చాలా వ్యూహాలను అమలు చేశాయి.

Maa Elections 2021 : మా ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. జీవీ వ్యూహం అదేనా?
X

Maa Elections 2021 : మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ లు చాలా వ్యూహాలను అమలు చేశాయి. చెప్పాలంటే జనరల్ ఎలక్షన్లలో రాజకీయ పార్టీలు ఎలా చేస్తాయో ఆ స్థాయిలో స్కెచ్ లు అమలు చేశాయి. అందుకే ఈసారి మా ఎన్నికలకు అంత హైప్ వచ్చింది. ఈ సందర్భంగా యాక్టర్ జీవీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

విలన్ క్యారెక్టర్లలో జీవీ ఎలా నటిస్తాడో అందరికీ తెలుసు. ఇక యాక్టర్ల ఎన్నికలకు సంబంధించి.. నిర్మాతలు, దర్శకులు, మేనేజర్లు ఫోన్ చేయడమేంటి అంటూ ఫైరయ్యారు. నిజానికి ఈ ఎన్నికలకు వారికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఎందుకు ఫోన్ లు చేసి మరీ పలకరిస్తు్న్నారని.. ఫలానా వారికే ఓటు వేయాలంటున్నారని ప్రశ్నించారు. అంటే తెర వెనుక నిర్మాతలు, దర్శకులు, మేనేజర్లు చక్రం తిప్పారని జీవీ మాటలను బట్టి అర్థమవుతోంది.

తాను కాని ఒకవేళ వచ్చే మా ఎన్నికల్లో పోటీ చేస్తే డబ్బులు చెల్లించి మరీ ప్రశాంత్ కిషోర్ ను తీసుకువస్తానని, ఆయన ఉంటే కచ్చితంగా గెలవవచ్చని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ పేరును వాడాల్సి వచ్చిందంటే.. ఈసారి ఎన్నికల వ్యూహాలను రెండు ప్యానళ్లు ఏ స్థాయిలో అమలు చేశాయో స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే జీవీ అలా వ్యాఖ్యానించి ఉంటారు.

చలనచిత్ర పరిశ్రమలో ఉన్నవారంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని జీవీ అన్నారు. అంటే అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి మా ఎన్నికలు ఏ స్థాయిలో ఆర్టిస్టుల మధ్య విభేదాలకు దారి తీశాయో జీవీ మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES