Keerthy Suresh: నా సినిమాలు నేను చూసుకోను: కీర్తి సురేష్
Keerthy Suresh: మహానటిగా మనందరి హృదయాలు దోచుకుంది.. కళావతిగా యువహృదయాలను కలవర పెట్టించింది. అయినా కానీ తనకెప్పుడు తన నటన సంతృప్తిని ఇవ్వలేదని చెబుతోంది కీర్తి సురేష్.. నటన మీద తనకున్న ప్యాషన్ ఇంకా బాగా చేయాలని అని ప్రతి సినిమాకు ముందు అనుకుంటుందట. నటిగా అన్ని తరహా పాత్రలు పోషించాలి.. అదే విధంగా కమర్షియల్ గాను ఆ సినిమా విజయం సాధించాలి.. అప్పుడే ఓ నటికి నిజమైన సంతృప్తి కలుగుతుంది అని అంటోంది కీర్తి.
ఇటీవల విడుదలైన చిత్రం సర్కారు వారి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కళావతిగా కీర్తి సురేష్ అందం, అభినయం ఆ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. తమిళంలో సాని కాయిదమ్ అనే డీగ్లామర్, రివెంజ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.
విభిన్న తరహా పాత్రలు చేసినప్పుడే నటిగా తనలోని వైవిద్యాన్ని ప్రేక్షకులు చూడగలుగుతారని అంటోంది కీర్తి. నా సినిమాలు నేను చూసుకోను. అలా చూస్తే నా నటనలోనే చాలా తప్పులు కనిపిస్తాయి. ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో కలిసి కేరళ వెళతాను. నా కుక్క పిల్ల నైకీతో ఆడుకుంటాను అని చెప్పింది. ప్రస్తుతం కీర్తి తమిళంలో మామన్నన్, మలయాళంలో వాశి, తెలుగులో నాని సరసన దసరా, చిరంజీవి చిత్రం భోళా శంకర్ లో ఆయనకు సోదరిగా నటిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com