Rakul Preet Singh: ఎప్పటికీ అలా చేయను: రకుల్‌ప్రీత్ సింగ్

Rakul Preet Singh: పాత్ర నచ్చితే ఏదైనా చేస్తాం అంటుంటారు సినిమా తారలు.. కానీ తాను మినహాయింపుని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.. పాత్ర డిమాండ్ చేస్తే బరువు పెరగడానికి లేదా తగ్గడిని, డీ గ్లామర్‌గా కనిపించడానకి కూడా వెనుకాడరు. అయితే ఈ విషయంలో నాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాను.
నాక్కూడా సినిమా అంటే ప్రాణం.. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలని నాకూ ఉంటుంది.. వాటి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటా.. కానీ బరువు పెరగడం, తగ్గడం లాంటి పనులు మాత్రం అస్సలు చేయను.. ఎందుకంటే అది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. సినిమాలో పాత్రల కోసం కావాలని బరువు పెరగడం, తగ్గడం చేస్తే అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆ తరువాత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే తెలిసి తెలిసి అలాంటి తప్పులు చేయను. నాకు నా ఫిట్‌నెస్ అనేది చాలా కీలకం. నా అదృష్టంకొద్దీ ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన దర్శకులెవరు అలాంటి పాత్రలు చేయమని అడగలేదు. షరతులు విధించలేదు అని రకుల్ చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com