మోకాలి గాయం నయం కావడానికి మూత్రం తాగాను: పరేష్ రావల్

మోకాలి గాయం నయం కావడానికి తన మూత్రం తానే తాగానని సినీ నటుడు పరేష్ రావల్ తెలిపారు. రాజ్ కుమార్ సంతోషి ' ఘటక్' సినిమా షూటింగ్ సమయంలో తన కాలికి గాయమైందని పరేష్ వెల్లడించారు. చిత్ర యూనిట్ అతన్ని వెంటనే ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయంలో తన కెరీర్ ఇక ముగిసిపోతుందని పరేష్ రావల్ భయపడ్డాడు. అజయ్ దేవగన్ తండ్రి మరియు ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ ఆసుపత్రిలో అతనిని సందర్శించి, త్వరగా కోలుకోవడానికి తన మూత్రాన్ని తానే తాగమని సూచించాడు.
ది లల్లాంటాప్ తో పరేష్ రావల్ మాట్లాడుతూ.. "నేను నానావతి ఆస్పత్రిలో ఉన్నప్పుడు వీరు దేవగన్ నన్ను చూడటానికి వచ్చాడు. అతను నా దగ్గరకు వచ్చి నాకు ఏమైంది అని అడిగాడు. నా కాలి గాయం గురించి నేను అతనికి చెప్పాను."
"ఉదయం లేవగానే నీ మూత్రం నువ్వే తాగు అని ఆయన నాకు చెప్పారు. అందరు యోధులు ఇలాగే చేస్తారు. మీకు ఎప్పటికీ ఎటువంటి సమస్య ఉండదు, ఉదయాన్నే మూత్రం తాగండి. మద్యం, మటన్, స్మోకింగ్ పూర్తిగా మానేయమని ఆయన నాకు చెప్పారు. ఉదయం క్రమం తప్పకుండా మూత్రం తాగమని ఆయన నాకు చెప్పారు" అని పరేష్ రావల్ గుర్తు చేసుకున్నారు.
ఆయన చెప్పినట్లే నేను 15 రోజులు చేశాను. అనంతరం తీసిన ఎక్స్-రే చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు" అని పరేష్ రావల్ అన్నారు. గాయం మానడానికి సాధారణంగా 2 నుండి 2.5 నెలలు పట్టేదని, కానీ నెలన్నరలోనే తాను కోలుకున్నానని ఆయన తెలిపారు.
"నేను దేనినై అనుసరించాల్సి వస్తే సరిగ్గా చెప్పినట్లు చేస్తాను. అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. సరిగా చేయకుండా ఫలితాన్ని ఆశించకూడదు అని పరేష్ అన్నారు. ముందు కష్టంగానే అనిపిస్తుంది. కానీ తప్పదు అనుకున్నప్పుడు చేయాలి అని తెలిపారు పరేష్ రావల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com