Naga Chaitanya : శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

Naga Chaitanya : శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వీళ్లిద్దరి పెళ్లి అయ్యింది. అప్పుడే వీళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలు పూర్తి అయ్యిందా అని అనిపిస్తుంది కదూ..ఇద్దరు కొత్త ఇంట్లోకి కూడా ప్రవేశించారు. వీళ్లిద్దరి పెళ్లి తర్వాత విడుదల అవుతున్న సినిమా ‘తండేల్’.

ఈ నెల 7వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. ప్రొమోషన్స్ కూడా దుమ్ము లేపేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తమిళం, హిందీ భాషల్లో కూడా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ చేస్తున్నారు.

Next Story