Mad 2: మ్యాడ్ 2 తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాను - కళ్యాణ్ శంకర్

Mad 2:  మ్యాడ్ 2 తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాను - కళ్యాణ్ శంకర్
X

మ్యాడ్ అనే టైటిల్ ని ఎంటర్ టైన్మెంట్ కి సింబల్ గా మర్చిన కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్వేర్ తో ఆ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచాడు.

బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈమూవీ సమ్మర్ సినిమాలలో హిట్ ఖాతాను ఒపెన్ చేసింది ..

ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ:

మ్యాడ్ టీం ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యింది:

మ్యాడ్ కంప్లీట్ యూత్ బేస్ గా వెళుతుంది.అది కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కానీ ఇందులో లడ్డు గాని పెళ్ళితో కథ మొదలవుతుంది .

అందులో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాడ్ స్కేర్ తో దగ్గరయ్యారు. థియేటర్ విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీస్ కనపడటం చాలా హ్యాపీ గా ఉంది.

లడ్డు గాని పెళ్ళి అనే ట్యాగ్ లైన్ మ్యాడ్ స్కేర్ కి ఫరెఫెక్ట్ :

ఈ బ్యాచ్ లో ఎవరికీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ విష్ణు ప్లే చేసిన లడ్డు గాని క్యారెక్టర్ కి ఫ్యామిలీ మొదటి పార్ట్ నుండి ఉంటుంది. అందుకే పెళ్ళి తో సినిమా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు లడ్డు క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాం . మ్యాడ్ కంటే మ్యాడ్ స్కేర్ లో అతని క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. తర్వాత సెంకాంఫ్ లో వచ్చే మురళి ధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ . ఆ ఫ్యామిలీ కి బాగా కనెక్ట్ అయ్యారు.

కొత్త వాళ్ళతో పనిచేయడానికి ఎప్పుడూ ఎదురు చూస్తుంటా:

మ్యాడ్ అప్పుడే సితారా బ్యానర్ లో ఫస్ట్ టైం ఆడిషన్స్ జరిగాయి. వందలమంది వచ్చారు చాలా ప్రెష్ టాంలెంట్ అవకాశాలు లేక ఇండస్ట్రీ బయట ఉంది. అందులోంచి కొంత మందిని మ్యాడ్ కి తీసుకున్నాను. ఆంథోని, సైకో శివ అలా వచ్చారు. నాకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కొత్త వాళ్ళతో పనిచేస్తాను. ఆడియన్స్ కి కూడా ఒక కొత్త ఫీల్ దొరుకుతుంది.

సితారా నా హోం బ్యానర్:

నాకు అవకాశం ఇవ్వడమే కాదు సినిమాను ఎప్పుడూ చిన్న గా చూడలేదు. నా మొదటి సినిమాకే మంచి టెక్నిషియన్స్ ని ఇచ్చారు. సినిమా కోసం ఎంత వరకైనా సితారా నిలబడుతుంది. ఆ బ్యానర్ లో పని చేయడం ఏ దర్శకుడికయినా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన కథ ఎదయినా నచ్చలేదు అంటే అప్పుడు బయట బ్యానర్స్ గురించి ఆలోచిస్తాను.

భీమ్స్ అర్ధం చేసుకున్నాడు:

థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిర్ణయం వంశీగారు తీసుకున్నారు. దాన్ని భీమ్స్ అర్ధం చేసుకున్నారు. అంతే తప్ప అందులో ఎలాంటి విభేదాలు లేవు. భీమ్స్ సంగీతం రూట్స్ నుండి వస్తుంది. మ్యాడ్ సక్సెస్ లో అతని భాగం చాలా పెద్దది. ట్యూన్ నచ్చలేదని చెప్పక్కర్లేదు నా మోహం చూసి మరొకటి చేద్దం అంటారు అంత కంఫర్ట్ ఉంటుంది భీమ్స్ తో

రవితేజ సినిమాకు మరింత కష్ట పడతాను:

మ్యాడ్ స్కేర్ తో నాకు బాధ్యత, భయం రెండూ వచ్చాయి. నెక్ట్స్ రవితేజ గారి మూవీకి మరింత కష్ట పడతాను. మ్యాడ్ స్క్వేర్ లో థియేటర్స్ లో ఆడియన్స్ ఎన్ని మూమెంట్స్ దొరికాయో వాటిని మరింత గా పేంచేందుకు ట్రై చేస్తాను.

నా టీం ని అడుగుతా :

ఏదయినా సీన్ రాసిన వెంటనే నా టీం కి చెబుతాను . వాళ్లు చాలా నిర్మోహమాటంగా బాగుంటే బాగుందని లేదంటే లేదని చెప్తారు. తర్వాత చినబాబుగారు, మా ఎడిటర్ నవీన్ నూలి తో షేర్ చేసుకుంటాను. వాళ్ల ఫీడ్ బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్.

అరవింద సమేత నుండి తీసుకున్నాం:

అరవింత సమేత లో తారక్ గారు ఫోన్ లో ఇచ్చే వార్నింగ్ సీన్ నాకు చాలా ఇష్టం . చాలా ఇంపాక్ట్ బుల్ గా ఉంటుంది. అలా ఫోన్ లో వార్నింగ్ ఇస్తుంటే మద్యలో సిగ్నల్ డ్రాప్ అయితే ఎంటి పరిస్థితి అనే ఆలోచన నుండి మ్యాడ్ స్క్వేర్ లో ఆ సీన్ డిజైన్ చేసాం .. థియేటర్ లా చాలాబాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ .

- కుమార్ శ్రీరామనేని

Tags

Next Story