Srinu Vaitla: 'దూకుడు' హిట్టు.. 'ఆగడు' ఫట్టు.. ఆ లాజిక్ మిస్సయ్యాం - శ్రీను వైట్ల

Srinu Vaitla: మహేష్ బాబుతో సినిమా అంటే ఆయన ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించాలి. ఒక ఫార్మాట్ వర్కవుట్ అయిందని అదే ఫార్మాట్‌లో ఇంకో చిత్రం తీస్తామంటే అభిమానులు ఒప్పుకోరు.
ఆచి తూచి అడుగెయ్యాల్సిందే దర్శక నిర్మాతలు.. దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్, శ్రీను వైట్ల కాంబో మరోసారి రిపీట్ చేయాలనుకున్నారు.. అదే తరహాలో మరోకథను సిద్ధం చేసి బ్యాంకాక్‌లో ఉన్న మహేష్‌కి వినిపించారు శ్రీను వైట్ల.
దానికి ఆగడు అని టైటిల్‌ని కూడా సిద్ధం చేశారు. దూకుడును మించి హిట్టవుతుందని ఎక్స్‌ఫెక్ట్ చేశారు.. కానీ వారి అంచనాలు తారుమారై సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న శ్రీను వైట్ల ఆగడు ఫెయిల్యూర్‌కి కారణం వివరించారు. నా సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతారు.
దూకుడు సినిమాలో లాగా మహేష్‌లో మాస్ క్యారెక్టర్ని మరింత ఎలివేట్ చేద్దామనుకున్నా.. కానీ నిర్మాతల కోసం నా ఆలోచన మార్చుకోవాల్సి వచ్చింది. అభిమానుల అంచనాలను ఆగడు అందుకోలేకపోయింది. దాంతో నిరాశ మిగిలింది. ఆ సినిమా ప్లాప్ అవడంతో చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా స్వార్ధంగా ఉండాలి.. సినిమా ఆడాలనే ప్రయత్నం చేయాలని అని నేర్చుకున్నా.
ఎక్కువ ఎక్సెపెక్టేషన్‌తో తీసిన సినిమా ఫెయిల్ కావడంతో మహేష్, నేను చాలా బాధపడ్డాం. ప్రస్తుతం మూడు కథలు ఉన్నాయి. అవి పూర్తి వినోదాత్మకంగా ఉంటాయి. ఆ చిత్రాలు పూర్తయిన తరువాత మహేష్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీస్తానని చెప్పారు దర్శకుడు శ్రీను వైట్ల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com