Bollywood: విలువ లేని వ్యక్తితో 18 ఏళ్లు కలిసి ఉన్నందుకు చింతిస్తున్నా.. : ఆలియా

Bollywood: విలువ లేని వ్యక్తితో 18 ఏళ్లు కలిసి ఉన్నందుకు చింతిస్తున్నా.. : ఆలియా
X
Bollywood: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్లు కాపురం చేశారు.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు..

Bollywood: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్లు కాపురం చేశారు.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడు ఒకరితో ఒకరికి సరిపడట్లేదు.. విడిపోదామని నిర్ణయించుకున్నారు. భర్త నవాజుద్దీన్‌తో ఇన్నేళ్లు కలిసి ఉన్నందుకు చాలా బాధపడుతున్నా అని భార్య ఆలియా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

సంసారం అంటేనే సర్దుకుపోవడం.. పెళ్లికి ముందు అతడు/ఆమెలో నచ్చిన విషయాలు పెళ్లయ్యాక నచ్చవు.. అయినా తప్పదని సంసారం చేసే వాళ్లు కొందరైతే, ఎందుకు భరించాలి అని విడిపోయేవాళ్లు మరికొందరు.. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకునే వాళ్లు ఎక్కువయ్యారు.

తాజాగా బాలీవుడ్‌లో మరో జంట విడిపోవడానికి సిద్దమైంది. వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఓ హోటల్‌లో బస చేస్తున్న నవాజుద్దీన్ ఆలియాను పరామర్శించేందుకు వచ్చి గేటు దగ్గర నిలబడి ఆమెతో మాట్లాడుతూ కనిపించాడు. ఈవీడియోను ఆలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిల్లలను చూడాలని ఉందని, షూటింగ్‌ ఆపుకుని మరీ వచ్చానని చెప్పాడు.

వీడియో వివరాల గురించి మాట్లాడుతూ, ఆలియా "నవాజుద్దీన్ రెండు రోజుల క్రితం వచ్చాడు, అతను షోరాను వీసా పని కోసం తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే, నిజం ఏమిటంటే, షోరా, నేను దుబాయ్ పౌరులం. మాకు వీసాతో పనిలేదు. అందుకే అతడితో షోరాను పంపలేదని చెప్పింది.

"అతను నన్ను మానసికంగా చాలా వేధించాడు. నేను అతనితో విడాకులు తీసుకుంటాను, నా పిల్లల సంరక్షణ కోసం పోరాడుతాను. నేను డబ్బు కోసం కక్కుర్తిపడుతన్నానని అనుకుంటున్నాడు. ఆలియా తన పిల్లలతో కలిసి దుబాయ్ నుండి తిరిగి ముంబైకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. నవాజుద్దీన్ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీతో ఆమెకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆలియా మాట్లాడుతూ.. ఇంట్లో తనను వేధిస్తున్నారని, ఆహారం తీసుకోకుండా అడ్డుకున్నారని తెలిపింది.

శుక్రవారం, ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో.. "నా దృష్టిలో నా గురించి పూర్తిగా విలువ లేని వ్యక్తికి నా 18 సంవత్సరాలు కేటాయించినందుకు చింతిస్తున్నాను. మొదట, నేను 2004లో అతనిని కలిశాను. అతను ముంబైలో ఉన్న సమయంలో మేమిద్దరం లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. అక్కడ అతను, నేను, అతని సోదరుడు షమాసుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం. మేము కలిసి మా ప్రయాణాన్ని ప్రారంభించాము.

చాలా సంతోషంగా ఉండేవాళ్లం. అతను నన్ను ప్రేమిస్తున్నాడని, జీవితాంతం నన్ను సంతోషంగా ఉంచుతాడని నమ్మాను. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఇంతకాలం అతడితో కలిసి ఉండి చాలా కోల్పోయానని బాధపడుతున్నాను అని పేర్కొంది. నవాజ్, ఆలియా 2011లో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు--కుమార్తె షోరా, కుమారుడు యాని ఉన్నారు.

Tags

Next Story