Keerthy Suresh: నేను అలా చేసి ఉండకూడదు.. అందుకే మహేష్ కి సారీ చెప్పా: కీర్తి సురేష్

Keerthy Suresh: మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట మే12 ధియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్. మహేష్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి కీర్తి మాట్లాడుతూ, అతడు తనను తరచుగా ఆటపట్టించేవాడని, ముఖ్యంగా డైలాగ్ సరిగా చెప్పలేకపోతే చాలా ఫీలయ్యేదాన్ని. నేను డైలాగ్ లేదా ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు. మొదట్లో అతను చాలా సీరియస్ గా ఉన్నాడేమో అని భయపడ్డాను. కానీ తరువాత తమాషా చేస్తున్నాడని గ్రహించాను, "అని కీర్తి సురేష్ పేర్కొంది.
ఒక పాట చిత్రీకరణ సమయంలో కోఆర్డినేషన్ మిస్సై అతడి చెంపపై ఒకటి, రెండు సార్లు కాదు మూడు సార్లు కొట్టాను. . అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు నేను చాలా భయపడ్డాను, బాధపడ్డాను.. అందుకే సారీ చెప్పాను అని షూటింగ్ విషయాలు గుర్తు చేసుకుంది.
ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ గురించి మాట్లాడుతూ అతనిలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ అతడి మొహంలో ప్రతిబింబిస్తుంది.. అందుకే అతడు మరింత అందంగా కనిపిస్తాడు అని కీర్తి చెప్పింది. మహేష్ తో కలిసి వర్క్ చేయడం చాలా బావుందని వివరించింది. సర్కారు వారి పాట మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. చిత్రంపై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com