Trisha Krishnan : నేను సి.ఎమ్ అవుతా.. త్రిష సంచలన వ్యాఖ్యలు

Trisha Krishnan :  నేను సి.ఎమ్ అవుతా.. త్రిష సంచలన వ్యాఖ్యలు
X

నేను ఏదో ఒక రోజు సి.ఎమ్ అవుతా అంటూ త్రిష చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజంగా ఈ మాట కావాలని అన్నదో లేక క్యాజువల్ గా అన్నదో కానీ ఇప్పుడు నెట్టింట ఈ మాటలే వైరల్ గా మారాయి. కాకపోతే ఈ మాటలు ఇప్పుడు అనలేదు. పదేళ్ల క్రితం ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో అంది. దీంతో ఇప్పుడా వీడియోను మళ్లీ రిలీజ్ చేసి వైరల్ గా చేశారు. త్రిష బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ఎర్లీ మార్నింగ్ తిరుమలకు వెళ్లి వెంకటేశుడి ఆశిస్సులు తీసుకుంది. అయితే ఆ విషయం పక్కన పెట్టి చాలామంది త్రిష ఈ పూజలు కేవలం తనకోసం మాత్రమే కాదు.. విజయ్ ఎన్నికల్లో గెలవడానికే చేసింది అంటూ చాలామంది చెబుతున్నారు.

మామూలుగా త్రిషతో విజయ్ ఎఫైర్ సాగిస్తున్నాడు అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయంలో ఇద్దరూ ఎప్పుడూ ఓపెన్ అవలేదు. కాదు అని కానీ అవును అని కానీ అనలేదు. ఏదేమైనా పదేళ్ల క్రితం తను సిఎమ్ అవుతా అని చెప్పిన ఇంటర్వ్యూలో క్యాజువల్ గా చెప్పిన మాటలు ఆమె కాదు కానీ విజయ్ సిఎమ్ అయ్యాడు అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. ఇక విజయ్ సి.ఎమ్ అవడం ఖాయం అని తెలిసిన తర్వాత ప్రభుత్వాధికారులు అంతా అతని ఇంటి వద్ద మకాం వేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో త్రిష కూడా విజయ్ ఇంటికే వెళ్లడం చూస్తుంటే త్వరలోనే ఈ ఇద్దరు కలిసి జంట అవుతారు అని భావిస్తున్నారు.

Tags

Next Story